అజాదీ అమృతకాలంలో తొలి విజయం: మోదీ

-

అజాదీ అమృతకాలంలో ఇది తొలి విజయమని ప్రధాని మోదీ అన్నారు. మీతో పాటు నేను కూడా నా గమ్యాన్ని చేరుకున్నానంటూ చంద్రయాన్-3 సందేశం ఇచ్చిందని పేర్కొన్నారు. బ్రిక్స్ సమావేశాల్లో ఉన్నా తన మనసంతా చంద్రయాన్ పైనే ఉందని చెప్పారు. ఈ విజయం దేశం గర్వించే మహత్తర క్షణాలని మోదీ తెలిపారు. ఇస్రో సైంటిస్టులకు, భారత ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

PM Modi to watch telecast of Chandrayaan-3's landing from BRICS Summit in  South Africa

ఇది 140 కోట్ల భారతీయుల విజయమని ప్రధాని కోనియాడారు. చంద్రయాన్ 3 విజయవంతమైన సందర్భంగా 1000 మంది ఇస్రో సిబ్బందికి నా అభినందనలు.. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లు ఎదురు చూశాం.. ఇది ఎంతో అద్భుతమైన క్షణం.. చంద్రయాన్‌ 3తో భారత్‌ కొత్త చరిత్ర సృష్టించింది.. కళ్లముందు అద్భుతాన్ని చూశాము.. నా జీవితం ధన్యమైసంది. అమృత కాలంలో తొలి ఘనవిజయం ఇది.. ఈ విజయం దేశం గర్వించే మహోన్నత ఘట్టం.. అంటూ ప్రధాని మోదీ బ్రిక్స్‌ నుంచి మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Latest news