చంద్రయాన్-3 ల్యాండింగ్ విజయవంతమైంది. సాఫ్ట్ ల్యాండింగ్ బుధవారం ప్రక్రియ ముగిసింది. దీంతో చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్రపుటల్లోకి ఎక్కింది. చంద్రుడిపై కాలు మోపిన నాలుగో దేశం భారత్. అయితే.. చంద్రయాన్-3 ప్రయోగంలో మూడు లక్ష్యాలు ఉన్నాయి. మొదటిది చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండ్ చేయడం. రెండోది చంద్రుడి ఉపరితలంపై రోవర్ దిగి సంచరించడం. మూడోది ల్యాండర్, రోవర్ కలిసి చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు చేయడం. ఇందులో మొదటి దశ విజయంవంతం అయ్యింది.
చంద్రయాన్ 3 రెండో లక్ష్యం.. చంద్రయాన్ 3 కమ్యూనికేషన్ లో ల్యాండర్ కీలకంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే ల్యాండర్ నుంచి బయటకొచ్చిన రోవర్‌తో ఇది కమ్యూనికేట్ చేస్తుంది. ల్యాండర్ మాడ్యూల్ లో కీలకమైన పేలోడ్స్‌ని అమర్చింది ఇస్రో. ఇందులో ముఖ్యమైనది రేడియో అనాటమి ఆఫ్ మూన్ బౌండ్ హైపర్‌సెన్సిటివ్ అయనోస్పియర్ అండ్ అట్మాస్పియర్(radio anatomy of moon bound hypersensitive ionosphere and atmosphere-RAMBHA-DFRS). ఈ పరికరం చంద్రుడి ఉపరితలంపై ప్లాస్మా సాంద్రతను పరిశీలిస్తుంది. అక్కడన్న అయాన్లు, ఎలక్ట్రాన్ల స్థాయిని కాలంతో పాటు వాటిలో వస్తున్న మార్పులపై అధ్యయనం చేసి.. సమాచారాన్ని ఇస్రో సెంటర్లకు చేరవేస్తుంది.
ల్యాండర్ లో అమర్చిన మరో కీలకమైన పరికరం.. చంద్రాస్ సర్ఫేస్ థెర్మో ఫిజికల్ ఎక్సపెరిమెంట్. ఇది చంద్రుడి ఉపరితలంపై థెర్మల్ ప్రాపర్టీలను అధ్యయనం చేస్తుంది. ల్యాండర్ లో అమర్చిన మరో కీలక పరికరం ఇన్ స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సైస్మిక్ యాక్టివిటీ (Instrument for Lunar Seismic Activity-ILSA). ఇది చంద్రయాన్ 3 ల్యాండర్ దిగిన ప్రదేశంలోని ప్రకంపనలను అంచనా వేస్తుంది. అంటే భూమిపై వచ్చే భూకంపాల తరహాను పసిగడుతుంది. చంద్రుడిపై నివాసానికి ఇది చాలా కీలకమైన పరిశోధన. భూకంపాల మాదిరిగానే చంద్రుడి ఉపరితలం.. చంద్రకంపాలు ఉంటాయా లేదా అనేది నిర్థారించనుంది. అదే విధంగా చంద్రుడి దక్షిణ ధృవంలోని ఉపరితలంపై ఉన్న మట్టి, రాళ్లపై పరిశోధనలు చేస్తుంది. దీని వల్ల నీటి ఆనవాళ్లు ఉన్నాయా లేదా అనేది స్పష్టం అవుతుంది.