నిర్వహణకు నిధుల సమస్య రాకుండా చూడాలి : సీఎం జగన్‌

-

ఏపీలో వైద్య, ఆరోగ్య శాఖ పని తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎంటి. కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల నిర్వహణకు నిధుల సమస్య తలెత్తనివ్వకుండా చేసే విధానం తీసుకురావాలని అధికారులకు నిర్దేశించారు.

New Central policy puts YS Jagan Mohan Reddy's move in jeopardy

ప్రభుత్వ రంగ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల నిర్వహణ అత్యున్నత స్థాయిలో, లోపరహితంగా ఉండాలని స్పష్టం చేశారు. ఆయా విద్యాసంస్థలకు ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్ మెంట్ నిధుల్లోంచే కొంత సొమ్మును సదరు సంస్థల నిర్వహణకు ఉపయోగించేలా నూతన విధానం ఉండాలని సీఎం జగన్ వివరించారు. ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల నిర్వహణకు నిధుల సమస్య రాకూడదని తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో రాజమండ్రి, విజయనగరం, నంద్యాల, మచిలీపట్నం, ఏలూరులోని మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు నిర్వహిస్తారని… మార్కాపురం, పులివెందుల, మదనపల్లె, ఆదోని, పాడేరులోని వైద్య కళాశాలల్లో వచ్చే ఏడాది నుంచి ప్రవేశాలు ఉంటాయని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news