‘విక్రమ్’ ఫొటోలు షేర్ చేసి.. డిలీట్ చేసిన ఇస్రో.. ఏమై ఉంటుందో..?

-

చంద్రయాన్ 2 ఆర్బిటార్ తాజాగా తీసిన విక్రమ్​ ల్యాండర్​ ఫొటోలను ఇస్రో సోషల్ మీడియా ఎక్స్​ (ట్విటర్)లో పోస్టు చేసింది. ‘నేను నీపై నిఘా పెడతాను!’ అంటూ చంద్రయాన్-2 ఆర్బిటార్ చేసిన వ్యాఖ్యలను క్యాప్షన్​గా ఇచ్చింది. అయితే ఈ పోస్టును కాసేపటికే డిలీట్ చేసింది. దీంతో ఏమైందోనని ప్రజలు గందరగోళంలో పడిపోయారు. అయితే ఇస్రో పెట్టిన పోస్టులో ఇంకా ఏం చెప్పిందంటే..?

‘చంద్రయాన్-2 ఆర్బిటర్.. చంద్రయాన్-3 ల్యాండర్​ను ఫొటోషూట్‌ చేసింది. చంద్రయాన్-2 ఆర్బిటర్ హై-రిజల్యూషన్ కెమెరా .. ప్రస్తుతం చంద్రుడిపై ఉన్న అత్యుత్తమ రిజల్యూషన్ ఉన్న కెమెరా. 23/08/23న ల్యాండ్ అయిన తర్వాత చంద్రయాన్-3 ల్యాండర్‌ను గుర్తించింది’ అని ఇస్రో పోస్టులో పేర్కొంటూ.. రెండు ఫొటోలను కూడా పోస్ట్​ చేసింది.

మరోవైపు.. జాబిల్లిపైకి దూసుకెళ్లిన విక్రమ్ ల్యాండర్​ పొట్టలో నుంచి ప్రగ్యాన్​ రోవర్​ చంద్రుడి ఉపరితలంపై దిగిన వీడియోను తాజాగా ఇస్రో విడుదల చేసింది. తన బుల్లి కాళ్లతో జారుకుంటూ వెళ్లిన రోవర్​ వీడియో ఆకట్టుకుంటోంది. నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news