పులస లేని లోటు తీర్చిన ‘తెలియాభోలా’.. రాత్రికి రాత్రే కోటీశ్వరులైన జాలర్లు

-

అదృష్టం ఉంటే.. డబ్బులు సంపాదించడం పెద్ద కష్టమే కాదు.. కాలం కలిసి వస్తే ఏదైనా సాధ్యం అవుతుంది. మత్స్యకారులకు ఖరీదైన చేపల వలలో చిక్కితే పండగే.. చేపల్లో హిల్సా అదేనండీ మన పులస చేపలు చాలా ఖరీదు. వీటి కోసం జనాలు ఎగబడుతుంటారు. పశ్చిమ బెంగాల్‌లో అక్కడి జాలర్లకు ఇవి వలలో చిక్కుతాయి. కానీ ఈ సంవత్సరం.. వేడి వర్షాల కారణంగా.. ఈ చేపల ఉత్పత్తి. తగ్గింది. కానీ అదే టైమ్‌లో దొరికిన ‘తెలియాభోలా’ చేప వల్ల జాలర్ల ముఖాల్లో చిరునవ్వు వికసించింది.

హిల్సా చేపల కొరతతో కుంగిపోయిన మత్స్యకారులకు ‘తెలియా భోలా’ చేపలు లభించడంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఈ అరుదైన చేపల ధర లక్షల రూపాయలు పలుకుతోంది. దిఘా ఈస్ట్యూరీ ఫిష్ వేలం కేంద్రం తూర్పు భారతదేశంలో అతిపెద్ద సముద్రపు చేపల వేలం కేంద్రం. ఈ కేంద్రంలో ఏటా పులస చేపల వేలం జోరుగా సాగుతుంది. ఈ సంవత్సరం.. సరిగ్గా హిల్సా చేపలు వచ్చే సమయంలో.. వేడి వర్షాలు కురిశాయట. దాంతో.. ఆ చేపల ఉత్పత్తి బాగా తగ్గింది.

దిఘా వాగు చేపల వేలం కేంద్రంలో సముద్రపు చేపల వేలంలో గణనీయమైన తేడా వచ్చి మత్స్యకారుల ఆదాయానికి ఘోరంగా గండి పడింది.. అయితే లక్షల రూపాయల విలువైన “తెలియా భోలా” చేపల వేలం కేంద్రానికి రావడంతో పరిస్థితి మారింది. ముహనా చేపల వేలం కేంద్రంలో మొత్తం 9 “తెలియా భోలా” చేపలను వేలం వేశారు. వాటి ధర కేజీ రూ.31 వేలు, ఒక్కో చేప దాదాపు 25-30 కేజీల బరువు ఉంది. జాలర్లు చేపల్ని తెచ్చిన రోజునే వీటిని కొనేశారు.

ఎందుకంత కాస్ట్‌

ఈ “తెలియా భోలా” చేపలు లోతైన సముద్రంలో కనిపిస్తాయి. ఈ చేపలోని కొన్ని భాగాలను మందుల తయారీలో ఉపయోగిస్తారు. ఇందుకోసం ఈ చేపల్ని విదేశాలకు ఎగుమతి చేస్తారు. అందుకే వీటికి అంత ధర పలుకుతుంది. ఈ చేప ప్రాథమికంగా లోతైన సముద్రపు చేప అని దిఘా వాగు మత్స్యకారుల, చేపల వ్యాపారుల సంఘం ఉపాధ్యక్షుడు నబ్‌కుమార్‌ పోయిరా తెలిపారు. ఈ చేప పేగులను ఔషధాల తయారీలో ఉపయోగిస్తారట. అందుకే ప్రపంచ మార్కెట్‌లో దీనికి మంచి డిమాండ్ ఉంది, ధర ఎక్కువగా పలుకుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news