కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు..3వ సారి విజయవాడ ఎంపీగా గెలుస్తా !

-

విజయవాడలోని పంజా సెంటర్ లో కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడోసారి కూడా ఎంపీ గా విజయవాడ నుంచి గెలుస్తున్నానని ప్రకటించారు కేశినేని నాని. దీంతో టీడీపీలో మళ్ళీ కాకరేపాయి కేశినేని నాని మాటలు. రెండు నెలలుగా సైలెంట్ గా ఉన్న కేశినేని… టీడీపీ నేత బేగ్ పుట్టిన రోజు పార్టీలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా మూడోసారి పోటీ చేసి పార్లమెంటుకు వెళ్తా అని ప్రకటించిన కేశినేని…. టీడీపీలో కొందరు నేతల టార్గెట్ గా విమర్శనాస్త్రాలు వదిలారు.

బెజవాడ పార్లమెంట్ పరిధిలో కేశినేని నాని సోదరుడు చిన్ని పార్టీ కార్యకలాపాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎంపీ సీటు చిన్నికి అధిష్టానం ఇస్తుందన్న ప్రచారం నేపధ్యంలో నాని కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. కేశినేని చిన్ని, బుద్ధా వెంకన్న, బోండా ఉమా, దేవినేని ఉమా, నాగుల్ మీరాతో కేశినేనికి విబేధాలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. బెజవాడ పశ్చిమలో కొంత మంది నుంచి ప్రజలకు, పార్టీ కార్యకర్తలు, నేతలకు విముక్తి కలగాలన్న నాని… ప్రజా సేవకు పనికిరాని వ్యక్తులు ప్రజా సేవలో ఉండకూడదు అనేది నా అభిమతం అంటూ కౌంటర్లు విసిరారు. దేవినేని ఉమాకు ప్రత్యర్థులుగా మైలవరంలో వ్యవహారాలు నడపుతున్న గన్నే ప్రసాద్, బొమ్మసాని వల్లే యువగళం సక్సెస్ అంటూ కితాబు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news