బాబుతో నో మైలేజ్..తమ్ముళ్ళ ఆవేదన.!

-

వయసు మీద పడిన సరే పార్టీని నిలబెట్టడం కోసం టి‌డి‌పి అధినేత చంద్రబాబు ఇప్పటికీ కష్టపడుతున్నారు. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి..జగన్ చేతిలో చావు దెబ్బతిని..టి‌డి‌పి పరిస్తితి ఇబ్బందుల్లో ఉంది. దీంతో పార్టీని పైకి తీసుకురావడానికి బాబు కష్టపడుతున్నారు. ఈ సారి అధికారంలోకి రావడం అనేది చాలా ముఖ్యం కాబట్టి బాబు అలుపు అన్నది లేకుండా తిరుగుతున్నారు. అటు నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.

ఇక బాబు సైతం ఏదొక కార్యక్రమం పేరుతో రోడ్ షోలు, బహిరంగ సభలు పెడుతున్నారు. అయితే అంతా బాగానే ఉంది..బాబు గ్యాప్ లేకుండా కష్టపడుతున్నారు. కానీ ఆ కష్టం టి‌డి‌పికి ప్లస్ అవుతుందా? అంటే అబ్బే అదేం కనిపించడం లేదు. బాబు పడుతున్న కష్టం చూస్తే ఈ పాటికి టి‌డి‌పి లీడ్ లో ఉండాలి. కానీ ఇప్పటికీ వైసీపీ లీడ్ లో ఉంది. వాస్తవానికి బాబుతో పోలిస్తే జగన్ ప్రజల్లో తిరిగేది తక్కువే. కేవలం బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. మరి అలాంటప్పుడు జగన్‌కే ప్రజా మద్ధతు ఎందుకు ఉంటే..ఆయన చేసే సంక్షేమమే వైసీపీకి పెద్ద్ ప్లస్. అదే టి‌డి‌పికి మైనస్.

బాబుని ఇప్పటికే మూడుసార్లు సి‌ఎంగా చూశారు. ఇంకా ఆయన్ని కొత్తగా చూడాల్సింది ఏమి లేదు. పైగా బాబు అధికారంలోకి వస్తే హామీలని సరిగ్గా నెరవేర్చరానే అనుమానాలు ఉన్నాయి. కానీ జగన్ అలా కాదు..మాట ఇస్తే తప్పరు. అందుకే బాబు ప్రజల్లో తిరుగుతూ ఎన్ని చెప్పిన నమ్మే పరిస్తితి లేదు. దీని వల్ల టి‌డి‌పికి ప్లస్ అవ్వడం లేదు.

ఇక దీంతో తెలుగు తమ్ముళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పుడు మళ్ళీ జనంలోకి బాబు వస్తున్నారు. బాబు పర్యటనల ఖర్చులే తడిసిమోపెడు అవుతున్నాయని, కానీ పార్టీకి ఎలాంటి ఉపయోగం ఉండటం లేదని ఇంచార్జ్‌లు గగ్గోలు పెడుతున్నారు. మొత్తానికి బాబుతో టి‌డి‌పికి అనుకున్న మైలేజ్ రావడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news