సూర్యుడి దిశ‌గా దూసుకెళ్తున్న ఆదిత్య మిష‌న్

-

సూర్యునిపై పరిశోధనలు చేసేందుకు గాను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ‘ఆదిత్య-ఎల్1’ మిషన్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. శనివారం శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్‌వీ-సీ57 వాహననౌక ఆదిత్య-ఎల్1 ఉపగ్రహంతో నింగిలోకి దూసుకెళ్లింది. ఇప్పుడు ఇది తొలి భూ కక్ష్య పెంపు విన్యాసాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆదివారం ఇస్రో వెల్లడించింది.

ISRO's Sun Mission, Aditya-L1, Performs Its 1st Earth-Bound Manoeuvre

ఆదివారం ఉద‌యం 11.45 గంట‌ల ప్రాంతంలో తొలిసారిగా ఎర్త్‌బౌండ్ ఫైరింగ్‌తో క‌క్ష్య‌ను మార్చిన‌ట్లు చెప్పింది. ప్ర‌స్తుతం ఆదిత్య ఎల్‌-1 భూమికి 22,459 కిలోమీట‌ర్ల దూరంలో ఉంద‌ని పేర్కొంది. అయితే, ఈ నెల 5న మ‌రోసారి క‌క్ష్య‌ను మార్చ‌నున్న‌ట్లు ఇస్రో పేర్కొంది. ఇదిలా ఉండ‌గా.. ఇస్రో పీఎస్ఎల్ వీ సీ-57 వాహ‌కనౌక ద్వారా ఆదిత్య ఎల్‌-1ను ఇస్రో విజ‌య‌వంతంగా నింగిలోకి పంపింది. గ‌తంలో చేప‌ట్టిన చంద్ర‌యాన్‌-3 త‌ర‌హాలోనే ప్ర‌యోగం సాగ‌నున్న‌ది . ఆదిత్య ఎల్‌-1 భూమి చుట్టూ తిరుగుతూ క‌క్ష్య‌ను పెంచుకుంటూ సూర్యుడి దిశ‌గా దూసుకెళ్ల‌నున్న‌ది. ఈ ఉప‌గ్ర‌హం భూమి క‌క్ష్య‌లోనే 16 రోజుల పాటు ఉండ‌నున్న‌ది. ఐదుసార్లు కక్ష్య‌ను మార్చుకొని లాగ్రాంజియ‌న్‌-1 పాయింట్‌కు చేరుకుంటుంది. ఇక్క‌డి నుంచే ఆదిత్య ఎల్‌-1 సూర్యుడిపై అధ్య‌య‌నం చేయ‌నున్న‌ది

 

 

Read more RELATED
Recommended to you

Latest news