“స్కంద” రిలీజ్ డేట్ ఫిక్స్ … “సలార్” రిలీజ్ పోస్ట్ పోన్ !

-

రామ్ పోతినేని మరియు డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ చిత్రం “స్కంద”. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని రిలీజ్ కు ముందు ప్రమోషన్ కార్యక్రమాలను చూసుకుంటోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ , ట్రైలర్ మరియు పాటలతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక స్కంద సినిమాను థియేటర్ లలో విడుదల చేసే డేట్ ను సెప్టెంబర్ 15 గా ప్రకటించగా, ఇప్పుడు ఆ డేట్ మారినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రభాస్ నటించిన సలార్ మూవీ వాస్తవంగా సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ కావాల్సి ఉండగా, ఇది కొన్ని కారణాల వలన వాయిదా అయ్యేలా ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో ఆ స్థానంలో స్కంద ను రిలీజ్ చేయడానికి చిత్రం బృందం పక్క ప్లాన్ చేసిందట.

ఇక నిర్మాత దిల్ రాజ్ దీని డిస్ట్రిబ్యూషన్ హక్కులను దక్కించుకోగా ఆయన కోరిక కూరకు సలార్ ను రిలీజ్ చేయకుండా వాయిదా వేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి స్కంద రిలీజ్ అయ్యి సక్సెస్ అవుతుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news