ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ సెక్రెటరీలు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇతర నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 16, 17వ తేదీలలో హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయి. కాగా ఈ సమావేశాల ఏర్పాట్లపై సీనియర్ నాయకులతో కేసీ వేణుగోపాల్ సమీక్షించనున్నారు.
ఒక్కో లీడర్ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. జన సమీకరణ, సభ సక్సెస్‌పై సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. ఇక ఈ రెండు మీటింగ్‌లు పూర్తయిన తర్వాత స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్‌తో కేసీ ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. అభ్యర్ధుల ఎంపిక అంశాలపై మాట్లాడనున్నారు. దీంతో పాటు ఇవాళ రాత్రి లేదా రేపు కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలుతో కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీలో చేరాలని భావిస్తున్న లీడర్ల ఫర్మామెన్స్, ప్రజాధరణపై చర్చించనున్నారు.