బ్రేకింగ్‌: టీటీడీ ఈవోను మార్చేసిన జ‌గ‌న్‌

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అనిల్ కుమార్ సింఘాల్ స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి జేఎస్వీ ప్రసాద్‌ను నియమించాలని వైఎస్‌ జగన్‌  నిర్ణయించినట్టు తెలుస్తోంది. నేడో, రేపో దీనిపై అధికారిక ప్రకటన విడుదల అవుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం జేఎస్వీ ప్రసాద్ ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధుల్లో ఉన్నారు.

బ్రేకింగ్‌: టీటీడీ ఈవోను మార్చేసిన జ‌గ‌న్‌
బ్రేకింగ్‌: టీటీడీ ఈవోను మార్చేసిన జ‌గ‌న్‌

అదే పదవికి ప్రసాద్ స్థానంలో సతీశ్ చంద్రను నియమిస్తున్నట్టు ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక ప్రసాద్ కు టీటీడీ బాధ్యతలను అప్పగించడమే తరువాయని సమాచారం. గతంలో జేఎస్వీ ప్రసాద్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ ఎక్స్ ఆఫీషియో మెంబర్ గా సేవలందించారు. ఇక అనిల్ కుమార్ కు ఏ బాధ్యతలు అప్పగిస్తారన్న విషయం తేలాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news