ఈ సంకేతాలు కనపడుతున్నాయా..? విటమిన్ సి లోపమే..!

-

పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా మంచి పోషకాహారాన్ని తీసుకుంటూ ఉంటారు అయితే ఒక్కొక్క సారి పోషకాహార లోపం కలుగుతూ ఉంటుంది విటమిన్ సి లోపం కూడా చాలా మందిలో కలుగుతుంది. అయితే విటమిన్ సి లోపం ఉందని ఎలా తెలుసుకోవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలని కచ్చితంగా రోజు తీసుకోవాలి.

విటమిన్ సి ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది విటమిన్ సి లోపం ఉన్నట్లయితే గోళ్లు గుంటలు పడినట్లుగా ఉంటాయి. పెళుసుగా కనపడతాయి కొంతమంది లో అయితే పల్చగా గోళ్లు మారి తొందరగా విరిగిపోతుంటాయి. ఇలా ఉన్నట్లయితే విటమిన్ సి తక్కువ ఉన్నట్లు గ్రహించాలి. చర్మం ఆరోగ్యంగా లేకపోతే కూడా విటమిన్ సి లోపం ఉందని తెలుసుకోవాలి.

విటమిన్ సి లోపం ఉన్నట్లయితే చర్మం డ్యామేజ్ అవుతుంది ఏదైనా గాయమైనా, రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు కూడా విటమిన్ సి లోపం అని తెలుసుకోవాలి కీళ్లవాపులు ఉన్నట్లయితే విటమిన్ సి లోపం ఉందని తెలుసుకోవాలి. చిగుళ్ళ వాపు హైపర్ థైరాయిడైజమ్, ఎనీమియా వంటివి కూడా విటమిన్ సి లోపానికి కారణమని గుర్తుంచుకోవాలి విటమిన్ సి లోపం ఉంటే సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవాలి. నారింజ, కమల, జామ, స్ట్రాబెరీ, బొప్పాయి వంటివి తీసుకోండి అప్పుడు విటమిన్ సి లోపం ఉండదు ఇలా వీటితో పోషకాలని పొందొచ్చు అలానే విటమిన్ సి లోపం కూడా ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news