హెల్మెట్లను ధరించి ఆఫీసులో పనిచేస్తున్న యూపీ విద్యుత్ శాఖ ఉద్యోగులు.. ఎందుకో తెలుసా..?

-

ఉత్తరప్రదేశ్‌లోని బాందాలో ఉన్న విద్యుత్ కార్యాలయంలో సిబ్బంది నిత్యం హెల్మెట్లను ధరించి పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు అలాంటి స్థితిలో ఉండగా వారిని తీసిన ఫొటోల‌ను కొందరు నెట్‌లో షేర్ చేశారు. దీంతో ఆ ఫొటోలు కాస్తా వైరల్ అయ్యాయి.

సాధారణంగా మనం హెల్మెట్లను ఎప్పుడు ధరిస్తాం..? ద్విచక్ర వాహనాలను నడిపేటప్పుడే కదా.. ఇతర సమయాల్లో మనం వాటిని పెట్టుకోవాల్సిన పనిలేదు. అసలు పెట్టుకోము కూడా.. కానీ యూపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం తమ కార్యాలయంలో హెల్మెట్లు పెట్టుకుని మరీ విధులు నిర్వర్తిస్తున్నారు. అవును, షాకింగ్‌గా ఉన్నా ఇది నిజమే. అయితే అక్కడ ఏదైనా కొత్త రూల్ పెట్టారా..? అంటే.. అదేమీ కాదు.. మరి వారలా ఎందుకు ఆఫీసులో హెల్మెట్లను ధరిస్తున్నారంటే…

electricity staff doing their duties wearing helmets

ఉత్తరప్రదేశ్‌లోని బాందాలో ఉన్న విద్యుత్ కార్యాలయంలో సిబ్బంది నిత్యం హెల్మెట్లను ధరించి పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు అలాంటి స్థితిలో ఉండగా వారిని తీసిన ఫొటోల‌ను కొందరు నెట్‌లో షేర్ చేశారు. దీంతో ఆ ఫొటోలు కాస్తా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో మీడియా వారి వద్దకు వెళ్లి ఎందుకు అలా ఆఫీసులో హెల్మెట్లను ధరిస్తున్నారని అడగ్గా.. అందుకు వారు జవాబిస్తూ.. తాము పనిచేస్తున్న కార్యాలయం నిర్మాణం చాలా పాతదని, అది ఏ క్షణంలో అయినా కూలిపోవచ్చని, ఇప్పటికే గోడలకు బీటలు పడి, రంధ్రాలు ఏర్పడి ఆ భవనం శిథిలావస్థకు చేరుకుందని, అది ఎప్పుడు కూలిపోతుందో తెలియకే రక్షణ కోసం తలకు హెల్మెట్లను ధరిస్తున్నామని.. ఆ సిబ్బంది తెలిపారు. దీంతో అవాక్కవడం మీడియా వంతైంది.

అయితే నిజానికి ఆ సిబ్బంది తమ గోడు పట్టించుకోవాలని తమ ఉన్నతాధికారులకు ఎన్నో సార్లు విన్నవించారట. అయినా ఫలితం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా.. ఆ ఉద్యోగులు మాత్రం నిత్యం భయం భయంగానే విధులు నిర్వరిస్తున్నారన్న మాట వాస్తవం. మరి ఈ విషయంలో ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Latest news