జీ20 సదస్సులో కరీంనగర్ సిల్వర్‌ ఫిలిగ్రికి అవకాశం

-

జీ-20 శిఖరాగ్ర సమావేశాలకు భారత్ సమాయత్తమైంది. దిల్లీ వేదికగా రేపటి నుంచి రెండ్రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అగ్రదేశాల అధినేతలు దిల్లీ వస్తున్నందున హస్తినలో భద్రత కట్టుదిట్టం చేశారు. దేశాధినేతలు బస చేసే హోటళ్లలోనూ పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పలు దేశాల అధినేతలు దిల్లీ చేరుకున్నారు.

Tomorrow, G20 meetings in Delhi

ఇక.. దిల్లీలో శని, ఆదివారాల్లో జరగనున్న జీ20 సదస్సుకు హాజరవుతున్న ప్రపంచ దేశాల అతిథులు సిల్వర్‌ ఫిలిగ్రి అశోక చక్ర బ్యాడ్జీని ధరించనున్నారు. ఈ బ్యాడ్జీని తయారు చేసే అవకాశం కరీంనగర్‌ కళాకారుడు ఎర్రోజు అశోక్‌కు దక్కింది. ఈ సదస్సుకు వివిధ దేశాల ప్రధానులు, అధ్యక్షులు హజరవుతున్నారు. వీరు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రి కళాకారుడు ఎర్రోజు అశోక్‌ రూపొందించిన అశోక చక్ర ఆకారంలో ఉన్న వెండి బ్యాడ్జీలను ధరించనున్నారు. మొత్తం 200 వెండి బ్యాడ్జీలను ఇక్కడి నుంచి తరలించారు. ఈ సమావేశాలు జరిగే చోట కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రి స్టాల్‌కు అనుమతి ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news