సిట్‌ ఆఫీస్‌కు చంద్రబాబు కుటుంబ సభ్యులు

-

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో ప్రధాన నిందితుడు చంద్రబాబు నాయుడ్ని అరెస్ట్‌ చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ ప్రకటించింది. నంద్యాలలో ఇవాళ ఉదయం ఆరుగంటలకు అరెస్ట్‌ చేశామన్నారు సీఐడీ అడిషనల్‌ డీజీ సంజయ్. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో ఆయన ప్రధాన నిందితుడని, కుట్రదారుడన్నారు. నకిలీ ఇన్‌వాయిస్‌ల ద్వారా షెల్‌ కంపెనీకి నిధులు మళ్లించారని.. ప్రభుత్వానికి రూ.371 కోట్లు నష్టం వచ్చింది అన్నారు.

చంద్రబాబుకు అ‍న్ని లావాదేవీల గురించి తెలుసని.. నిధుల దారి మళ్లింపునకు సంబంధించి చంద్రబాబును ప్రశ్నించాల్సి ఉందన్నారు. చంద్రబాబును కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌ చేయాల్సిందే అన్నారు. అయితే.. చంద్రబాబును కలిసేందుకు శనివారం సాయంత్రం నందమూరి రామకృష్ణతో పాటు నారా భువనేశ్వరి, లోకేశ్‌ సిట్‌ కార్యాలయానికి వచ్చారు. పోలీసులు వారిని కార్యాలయంలోకి అనుమతించారు. కుటుంబ సభ్యులను మాత్రమే లోపలికి వెళ్లి చంద్రబాబును కలిసేందుకు అనుమతిస్తామని పోలీసులు తెలిపారు.

 

చంద్రబాబును కలవడానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు అనుమతి ఇవ్వకపోవడంతో విజయవాడకు రావాలనే ఆలోచనను పవన్ విరమించుకున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం కార్యాలయంలోకి ప్రవేశించేందుకు అనుమతి నిరాకరించడంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు శనివారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్లీడర్లను కార్యాలయంలోకి అనుమతించినా వారిని అనుమతించలేదని వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఉదయం నుంచి పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని న్యాయవాదులు ఆరోపించారు తమ క్లయింట్ చంద్రబాబుతో కలిసి ఉండేందుకు ఏ నిబంధన ప్రకారం అనుమతి నిరాకరించారో చెప్పాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news