అమెరికాలో ఓ వింత ఘటన జరిగింది. ట్యాబ్లెట్ అనుకోని ఆపిల్ ఎయిర్ పాడ్ మింగేసింది ఓ మహిళ. బోస్టన్‌కు చెందిన బార్కర్ అనే ఓ టిక్ టాక్ యూజర్ తాను మెడిసిన్ అనుకుని ఎయిర్ పాడ్ మింగేశానని ఓ వీడియో రికార్డు చేసి దానిని టిక్ టాక్‌లో పోస్టు చేయగా అది కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఒక చేతిలో ఐబుప్రోఫెన్ 800 ట్యాబ్లెట్ పట్టుకున్నానని, మరో చేతిలో ఎయిర్ పాడ్ ఉందని.. పొరపాటున ట్యాబెల్ అనుకుని ఎయిర్ పాడ్ మింగేశానని వీడియోలో చెప్పుకొచ్చింది. మరో చేతిలో ట్యాబ్లెట్ చూసి అవాక్కైనట్లు తెలిపింది. గొంతులో ఉండగానే గుర్తించినప్పటికీ.. ఎయిర్ పాడ్‌ను మాత్రం బయటకు తీయలేకపోయినట్లు చెప్పింది. దీంతో వెంటనే తాను ఆస్పత్రికి వెళ్లిందట.
వైద్యులు ఎక్స్‌రే తీసి తన కడుపులో ఎయిర్ పాడ్ ఉన్నట్లు నిర్ధారించారు. ఎయిర్ పాడ్‌ను సర్జరీ చేసిన తీయాల్సిన అవసరం లేదని, దానికదే బయటకు వచ్చేస్తుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వైద్యుల సలహాను పాటిస్తున్నానని బార్కర్ చెబుతున్నారు. పరధ్యానంలో ఉంటే ఎలాంటి సమస్యలు కొని తెచ్చుకుంటామో తనే ఓ ఉదాహరణ అని బార్కర్ నెటిజన్లకు సూచించారు.
ఇదే అసలైన ట్విస్ట్..
ఎయిర్ పాడ్ దానికదే వస్తుందని వైద్యులు చెప్పారు. కానీ బార్కర్ కడుపులో ఉన్న ఎయిర్ పాడ్ ఐఫోన్‌కు కనెక్ట్ అవుతోంది. ఎవరైనా కాల్ చేస్తే కడుపులో నుంచి శబ్దాలు కూడా వినిపిస్తున్నాయట. కడుపులో గరగర శబ్దాలు కూడా వస్తున్నాయని బార్కర్ వెల్లడించారు. కడుపులో నుంచి ఎయిర్ పాడ్ బయటకు వచ్చిన తర్వాత దానిని తిరిగి వాడబోనని బార్కర్ చెబుతోంది. ఇంతకీ అది ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో లేక సర్జరీ చేయాల్సి వస్తుందో. ! అందుకే పరధ్యానంలో ఉండి మాత్రలు అస్సలు వేసుకోకూడదు. ఒక ట్యాబ్లెట్ వేసుకోవాల్సింది మరో ట్యాబ్లెట్ వేసుకోవడం లేకపోతే ఇలా ఎయిర్ పాడ్ మింగడం వంటివి జరుగుతాయి.