ఆరు అడుగుల పొడవుగా గోళ్లు పెంచుకున్న వార్తలను మీరు చూసే ఉంటారు. కానీ 250 అంగుళాల పొడవున్న జుట్టును ఉన్న వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూశారు. మనిషికి పాదాల వరకూ జుట్టు ఉన్నవాళ్లను మనం ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తున్నాం. కానీ అది అంతకు మించి ఉంది. అది కూడా ఒక వృద్ధుడికి. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి తన జుట్టును చూపించేదుకు ఏకంగా గోడ ఎక్కాడు.
ప్రతిరోజు వైరల్ అయ్యే వీడియోలో భాగంగానే ఈరోజు కూడా సోషల్ మీడియాలో ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో తెగ వైరల్గా మారింది. వీడియోలో ఓ వ్యక్తి గోడ పై నిలుచుని మరి తన పొడవాటి కురులను అందరికీ చూపిస్తున్నారు. ఈ వీడియోలో కనిపిస్తున్న వృద్ధుడు గత 40 ఏళ్ల సంవత్సరాల నుంచి తన జుట్టును కత్తిరించకుండా పెంచాడని గ్రామస్తులు తెలిపారు. దాదాపు ఈ జుట్టు 20 అడుగులకు పైగానే ఉంటుందని వారు అంటున్నారు. ఏది ఏమైనా నేటి జీవన శైలి కారణంగా చాలామందిలో బట్టతలలు వస్తున్నాయి. కానీ ఈ వృద్ధుడికి జుట్టు సమస్య లేకుండానే ఇంత పొడవుగా పెరగడాన్ని చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఈ వీడియోను సోషల్ మీడియా వినియోగదారుడు తన ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వీడియో చూసిన వారంతా ఇదేం జుట్టు రా బాబు అంటున్నారు. నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్ల రూపంలో స్పందిస్తున్నారు. ఈరోజుల్లో చాలామందికి..చిన్న వయసులోనే జుట్టు ఊడిపోతుంది. కానీ ఇంత జుట్టును ఇన్ని ఏళ్లుగా మెయింటేన్ చేస్తున్నాడంటే గ్రేటే. అయితే అది కాస్త నీటిగా ఉంటే బాగుండేది.. అది అంతా బిగుతుగా అయిపోయి.. దువ్వడానికే వీలు లేకుండా పోయింది. ఈ వీడియోకు ఇప్పటి వరకూ.. 33k పైగా వ్యూస్ వచ్చాయి. మీరు కూడా ఒకసారి చూడండి.
View this post on Instagram