ఈ జైళ్ళు నరకానికి ప్రతి రూపాలు… ఆ జైల్లో ఉండటం కంటే చావడమే నయం…!

-

బ్రెజిల్ జైళ్ళు” శిక్ష పడి జైలుకి వెళ్ళిన ఖైదీల పాలిట నరకకూపాలు. మాదక ద్రవ్యాల గ్యాంగులతో నిత్యం నరకాన్ని తలపిస్తూ ఉంటాయి. అసలు ఈ గొడవలు ఎందుకు..? ప్రధాన ముటాలు ఏవి..? జైలు అధికారులతో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంత మేర ఉంది..? ఒకసారి చూద్దాం…

ఫస్ట్ క్యాపిటల్ కమాండ్(పీసీసీ), రెడ్ కమాండ్ (సీవీ) అనే రెండు ముటాలు జైళ్ళు అడ్డాగా డ్రగ్స్ వ్యాపారం చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో వీటి మధ్య వ్యాపార తీవ్రత కూడా తారా స్థాయికి చేరుకుంది. దీనితో ఖైదీలు కూడా కూడా రెండు వర్గాలుగా విడిపోయి ఈ వ్యాపారంలో భాగస్వాములు అయ్యారు. దీనికి జైలు అధికారుల సహకారం కూడా ఉంది అనేది అక్కడ ప్రధాన ఆరోపణ. అయితే ఈ రెండు వర్గాల కారణంగా ఇతర ఖైదీలు ఇబ్బంది పడినా వారిని ఇతర జైళ్ళకు తరలించే ప్రయత్నాలు కూడా చెయ్యలేదు.

అయితే ఈ రెండు వర్గాల మధ్య రెండేళ్ళ క్రితం సంధి కూడా జరగగా రెండు వర్గాలుగా విడిపోయిన ఖైదీలు ఒకరి వ్యాపారంలో మరొకరు తలదూర్చే వారు కాదు. ఈ తరుణంలో డబ్బు పంపకాల్లో ఒక వర్గంలో చెలరేగిన ఘర్షణ తారా స్థాయికి చేరుకుంది. దీనితో రెండేళ్ళ నుంచి ఇప్పటి వరకు ప్రతి మూడు నెలలకు దాదాపు 80 మంది పైగా ఈ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. 600 మందికి మాత్రమె సామర్ధ్యం ఉన్న జైళ్లలో వెయ్యి మందికి పైగా ఖైదీలను ఉంచుతూ వస్తున్నారు అధికారులు.

ఈ సమస్య అక్కడి హోం మంత్రిత్వ శాఖ వద్దకు వెళ్ళడంతో మరో 50 శాతం వరకు జైళ్ళను పెంచాలని ఆదేశాలు కూడా జారి చేసినా ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. బ్రెజిల్‌లోని జైళ్లు ఇప్పుడు 6,22,000 మంది ఖైదీలతో ఉన్నాయి. ప్రతి ఒక్క జైలు కూడా సామర్ధ్యానికి మించి ఉన్నట్టు సమాచారం. అయితే వీరిలో ఎక్కువగా నల్ల జాతీయులు ఉండే జైళ్లలోనే ఆధిపత్య గొడవలు ఎక్కువగా జరుగుతాయని జైలు అధికారులు చెప్పడం గమనార్హం.

ఏడాది క్రితం మనాస్ జైల్లో 17 గంటల పాటు జరిగిన ఒక ఘటనలో 56 మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. దీనితో అక్కడి కుటుంబాలు కూడా ఖైదీ జైల్లో ఉంటె ఆశలు వదులుకునే పరిస్థితి తలెత్తింది. అయితే డ్రగ్స్ మాఫియా జైళ్లలోనే ఎక్కువగా ఉండటంతో నేరాల స్థాయి కూడా భారిగా ఉందని…అలాగే బయట కూడా ఇది ఎక్కువగా ఉండటంతో వారిని జైలుకి తీసుకొచ్చి పెట్టడం తో వారు జైలుకి వచ్చి కూడా ఇదే తరహా విధానం కొనసాగించడంతో అధికారులు కూడా చేతులేత్తాసారు. కాగా ఇటీవల ఒక జైల్లో ఖైదీల మధ్య ఘర్షణనను అదుపు చెయ్యడానికి గాను పోలీసులు కాల్పులు జరపగా 21 మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు.

Read more RELATED
Recommended to you

Latest news