సిరిసిల్ల జిల్లా వాసికి గల్ఫ్ జైల్ నుంచి విముక్తి

-

కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట వాసికి గల్ఫ్ జైల్ నుంచి విముక్తి లభించింది. 17 సంవత్సరాల తర్వాత కోనరావుపేట వాసి విడుదలకు కోర్టు అంగీకారం తెలిపింది. మరో నలుగురి విడుదల పై సందిగ్ధత నెలకొంది. 17 ఏళ్ళుగా ఓ హత్య నేరంలో దుబాయిలో జైలు శిక్ష అనుభవిస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాకి చెందిన ఐదుగురు వ్యక్తులు.

కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన దండుగుల లక్ష్మణ్ కి పరాజ్ కింద(మానవతా దృక్పథం) విడుదల చేసేందుకు కొర్టు అంగీకారం తెలిపింది. మరో నలుగురు సిరిసిల్ల జిల్లా పెద్దూరుకి చేందిన శివరాత్రి రవి, శివరాత్రి మల్లేష్, గొల్లెపు నాంపల్లి, శివరాత్రి హన్మంతు శిక్ష అనుభవిస్తున్నారు. నేపాల్ కి చెందిన సెక్యూరిటి గార్డు హత్య కేసులో 17 ఏళ్ళుగా దుబాయ్ లో‌ శిక్ష అనుభవిస్తున్నారు ఈ ఐదుగురు.

వీరి విడుదల కోసం మంత్రి కేటిఆర్ స్వయంగా భాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి ఐదుగురి క్షమాభిక్ష కోసం 15 లక్షలు షరియా చట్టం ప్రకారం పరిహారం చెల్లించారు. న్యాయవాది అభ్యర్థన‌ మేరకు అనారోగ్యం, వృద్ధాప్యం కారణాల దృష్ట్యా కల్పించే ఫరాజ్ కింద లక్ష్మణ్ విడుదలకు దుబాయ్ న్యాయస్థానం అమోదం తెలిపింది. మిగిలిన నలుగురి విడుదల కోసం ప్రయత్నం‌ చేస్తున్నారు మంత్రి కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news