కాంగ్రెస్ బిగ్ స్కెచ్..బీఆర్ఎస్-ఎం‌ఐ‌ఎంకి చెక్?

-

తెలంగాణలో కాంగ్రెస్ ఈసారి బిఆర్ఎస్ కు చెక్ పెట్టాలని గట్టిపట్టుతో ఉంది. ఆ దిశగానే పక్కా ప్రణాళికతో పావులు కదుపుతోంది. తుక్కుగూడ సభ తర్వాత నియోజకవర్గాలలో తన స్పీడ్ పెంచింది. తమ ప్రభుత్వం ఇస్తున్న 6 గ్యారంటీలను మహిళలకు ముఖ్యంగా మైనారిటీ మహిళలకు చేరువ చేసేలా వ్యూహరచన చేస్తోంది.

ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్లు ఒక ఎత్తుతో బిఆర్ఎస్, ఎంఐఎం, బిజెపికి చెక్ పెట్టే ఆలోచనలో ఉంది. మహాలక్ష్మి పథకం, 500 కి గ్యాస్ సిలిండర్, బస్సులో ఫ్రీ ప్రయాణం లాంటివి ఆర్థికంగా ఎంత ఉపయోగపడతాయో మహిళలందరికీ మీటింగ్ పెట్టి, పోస్టర్లు వేసి ప్రచారం చేయాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నారు. 200 లోపు ఉచిత కరెంటు  ముస్లిం మహిళలకు వివరించి చెప్పాలని అనుకుంటున్నారు.

బిఆర్ఎస్ కి ఇన్నాళ్లు అండగా ఉన్న మైనారిటీ మహిళలను మహాలక్ష్మి పథకం ద్వారా తమ వైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారు. యువ వికాసం పేరుతో 5,00,000 మైనారిటీ యువతకు ఎంతగానో ఉపయోగపడుతుందని మహిళలకు వివరించి చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

తప్పులను ఎత్తిచూపుతూ బిఆర్ఎస్ ను ప్రశ్నించనీ బిజెపి, ఎంఐఎం పై ప్రజలలో ఉన్న వ్యతిరేకతని తనకి అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ చూస్తుంది. కాంగ్రెస్ వ్యూహం పలించి మైనారిటీ మహిళలు కాంగ్రెస్ కు మద్దతుగా నిలుస్తారా ? బిఆర్ఎస్ కు షాక్ ఇస్తారా? ఎన్నికల వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news