ప్రస్తుతం ఐర్లాండ్ క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ తో మూడు వన్ డే సిరీస్ ను ఆడడానికి వచ్చిన సంగతి తెలిసిందే. అందులో మొదటి వన్ డే వర్షార్పణం కాగా , రెండవ వన్ డే లో ఇంగ్లాండ్ ఐర్లాండ్ ను చిత్తు చిత్తు చేసి ఆధిక్యంలోకి వెళ్ళింది. ఇక చివరిది అయిన మూడవ వన్ డే లో టాస్ గెలిచిన ఐర్లాండ్ జట్టు మొదటగా బౌలింగ్ ఎంచుకుంది. దీనితో బ్యాటింగ్ కు వచ్చిన ఇంగ్లాండ్ మొదటి బంతి నుండి ఐర్లాండ్ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. కేవలం 3 .3 ఓవర్ లలోనే పరుగులు ఇంగ్లాండ్ చేసిందంటే విద్వంసం ఏ స్థాయిలో జరిగిందన్నది అర్ధం చేసుకోవచ్చు, ఓపెనర్ లుగా వచ్చిన ఫిలిప్ సాల్ట్ మరియు విల్ జాక్స్ లు ఇద్దరూ ఫోర్లు సిక్సులతో అలరించారు. ఇక కేవలం ఎనిమిది ఓవర్ లలోనే 100 పరుగులు చేసి ఇంగ్లాండ్ రికార్డు సాధించింది అని చెప్పాలి. ఇంగ్లాండ్ కు వన్ డే లలో మొదటి ఎనిమిది ఓవర్ లలో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం.
ఇదే విధంగా ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఆడితే వన్ డే లలో అత్యధిక స్కోర్ ను కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది. మరి చూద్దాం ఏమి జరగనుందో … !