నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్.. కోర్టు ఏం తీర్పు ఇవ్వనుంది ?

-

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. నేటితో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ ముగియనుంది. అక్టోబర్‌ 5 తేదీ వరకు తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు రిమాండ్‌ గత నెలలో విధించింది ఏసీపీ కోర్టు.

అయితే.. నేటితో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ ముగియనుంది. ఇక ఇవాళ రిమాండ్ పొడిగింపుపై ఆదేశాలు ఇవ్వనుంది ఏసీబీ కోర్టు. వర్చువల్ విధానంలో చంద్రబాబుని ఏసీబీ జడ్జి ముందు ప్రవేశ పెట్టనున్నారు అధికారులు. చంద్రబాబు రిమాండ్ పొడిగించాలని కోరుతూ నేడు మెమో ఫైల్ చేయనుంది సీఐడీ. కాగా, ఇవాళ సాయంత్రం ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకోనున్నారు టీడీపీ అగ్రనేత నారా లోకేష్. గన్నవరం నుండి నేరుగా రోడ్డు మార్గం గుండా రాజమండ్రి వెళ్ళనున్న నారా లోకేష్….రేపు ఉదయం మలాకత్ లో చంద్రబాబును కలవనున్నారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news