సాధారణంగా శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీలసెంటిగ్రేడ్ స్థాయిలో ఉంటుంది. ఇది కాస్త ఎక్కువైతే శరీరం బాగా వేడి చేసిందని చెప్పవచ్చు. అయితే శరీరంలో ప్రస్తుతం ఎంత వేడి ఉందో చెప్పలేము. మరి ఉష్ణోగ్రత ఎక్కువయిందని ఎలా నిర్థారించగలం అని చాలామందికి సందేహాలు వస్తుంటాయి. వీటికి కొన్ని సంకేతాలున్నాయి. అవేంటో చూద్దాం.
శారీరక శ్రమ ఎక్కువైనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు శరీరం బాగా వేడుక్కుతుంది. వ్యాధులకు వాడే మందులు వల్ల కూడా శరీర ఉష్ణోగ్రత పెరగడానికి కారణమవుతాయి. ఇది మామూలుగా ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. శరీర ఉష్ణోగ్రత ఎక్కువైతే మూర్ఛ లేదా కొన్ని తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుంది. శరీరం అధికంగా వేడికి గురయినచో గుండె సమస్యలు వస్తాయి. ఆరోగ్యాన్ని ప్రభావితం చేస డీహైడ్రేషన్, సున్నితమైన కణజాలాలను దెబ్బతీస్తుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి కూడా దెబ్బతింటుంది. అప్పుడప్పుడు స్పృహ కోల్పోవడం లాంటివి జరుగుతుంటాయి.
శరీరంలో వేడి ఎక్కువయినప్పుడు కనిపించే లక్షణాలు :
చర్మంలో జలదరింపు :
కూలీ పనులు చేసేవాళ్లు ఎండలో ఎక్కువగా కష్టపడుతుంటారు. వారికి శరీరం ఎక్కువగా వేడెక్కుతుంటుంది. దీంతో చర్మం, గూస్బంప్స్‌లో జలదరింపు అనిపించినట్లుగా ఉంటుంది. అంతా గందరగోళంగా ఉంటుంది.
తలనొప్పి :
శరీరంలో వేడి ఎక్కువయినప్పుడు తలనొప్పి రావడం సర్వసాధారణం. దీంతో అలసట, హీట్ స్ట్రోక్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఇలాగే కొనసాగితే ప్రమాదకరం. వీలైనంతవరకు శరీరాన్ని చల్లబరుచుకోవాలి.
వికారం :
శరీరంలో వేడి ఎక్కువైనప్పుడు తలనొప్పి వస్తుంది. దీని తర్వాత అలసట పెరుగుతుంది. ఇవి రెండూ అధికమయితే వికారం, వాంతులు అవుతుంటాయి. ఇలా ఉన్నప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
అలసట, బలహీనత :
శరీర ఉష్ణోగ్రత పెరగడంతో మీ శక్తిస్థాయిలు తగ్గుతూ ఉంటాయి. దీంతో అలసటకు గురవుతాయి. మెల్లమెల్లగా బలహీనపడుతారు.
చెమట ఎక్కువగా పట్టడం :
వేడి ఎక్కువైనప్పుడు చర్మం చెమటలు పడుతుంది. ఆ సమయంలో ఎండలో గనుక ఉంటే వెంటనే నీడలోకి వెళ్లాలి. చెమట పట్టడం మంచితే అనుకుంటారు. ఎలాంటి పరిస్థితిలో చెమట పడుతుందో నిర్థారించుకోవాలి. దీనికి యాన్హిడ్రోసిస్ అని పిలుస్తారు. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. చెమటను ఉత్పత్తి చేస్తుంది. వైద్యసాయం తీసుకోవడం మంచిది.
మైకం :
శరీరం వేడెక్కడంతో అలసట చెంది మైకంలోకి వెళ్తుంటారు కొందరు. దీంతో వారు ఏం చేస్తుంటారో కూడా గుర్తుండదు. ఈ పరిస్థితి ఎక్కువ కాకుండా చూసుకోవాలి. దీనికి వెంటనే చికిత్స చేయకపోతే హీట్ స్ట్రోక్‌కు కారణం అవుతుంది.
పరిష్కారం :
వీటన్నింటికీ ఒక్కటే పరిష్కారం రోజుకు కనీసం నాలుగు లీటర్లు అయినా నీరు తాగాలి. రోజూ తినే ఆహారంతో పాటు మందులు వేసుకోవడం వల్ల బాడీహీట్ ఎక్కువ అవుతుంది. వీటికి తగినట్లుగా నీరు తాగితే సమస్యను అదిగమించవచ్చు.