తెలంగాణలో అసలైన ఎన్నికల యుద్ధం మొదలుకానుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన పార్టీలు ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. ఈ యుద్ధంలో పై చేయి సాధించడానికి పార్టీలు పోరాటం మొదలుపెట్టనున్నాయి. తాజాగా విడుదలైన షెడ్యూల్ చూస్తే..నవంబర్ 30న ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. నవంబర్ 10న నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది.
ఇక తెలంగాణతో పాటు రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 7న మిజోరాం, నవంబర్ 17న మధ్యప్రదేశ్, నవంబర్ 23న రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఛత్తీస్‌ఘడ్ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 7, 17 తేదీల్లో ఎన్నికలు ఉంటాయి. అన్నీ రాష్ట్రాల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడతాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో..ఇక ప్రధాన పార్టీలు ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే బిఆర్‌ఎస్ అభ్యర్ధులని ప్రకటించి రేసులో ముందు ఉంది. అటు కాంగ్రెస్, బిజేపిలు అభ్యర్ధులని ప్రకటించే పనిలో ఉన్నాయి. అయితే ఈ సారి అధికార బిఆర్‌ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వడానికి కాంగ్రెస్ రెడీ అవుతుంది. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ తేలిపోయింది కానీ..ఈ సారి టఫ్ ఫైట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. మొన్నటివరకు రేసులో ఉన్న బిజేపి కాస్త వెనుకబడింది. కాకపోతే కొన్ని స్థానాల్లో బిజేపి..బిఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఆ పార్టీ తరుపున బలమైన నేతలు బరిలో దిగితే గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అలా కాకుండా నాయకులు ఏమైనా జంప్ కొడితే బిజేపికి కాస్త నష్టం. ఏదేమైనా ప్రధాన పోటీ బిఆర్‌ఎస్,కాంగ్రెస్la మధ్య ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. మరి ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారో చూడాలి.