చంద్రబాబు బెయిల్ కోసం టీడీపీ డ్రామాలు ఫలించేనా ?

-

ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గతంలో అధికారంలో ఉండగా స్కిల్ డెవెలప్మెంట్ పేరిట స్కాం చేసినందుకు గాను సిఐడి అరెస్ట్ చేసి నెల రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉంచడం జరిగింది. ఈ కేసులో ఇప్పటి వరకు చంద్రబాబు లాయర్లు సాధించిన పురోగతి శూన్యం అని చెప్పాలి.

ఇక తాజాగా నిన్న సాయంత్రం ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, అలర్జీ వచ్చిందని డ్రామా స్టార్ట్ చేశాడు మహానటుడు చంద్రబాబు. కానీ రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ కు చెందిన డాక్టర్లు వచ్చి చంద్రబాబు ను పరీక్షించి ఎటువంటి ఆరోగ్య సమస్య లేదని తేల్చి చెప్పారు. కానీ ముందే పథకం ప్రకారం ఈ న్యూస్ నిన్న జైలు నుండి రావడంతోనే బయట టీడీపీ ఉద్దండ పిండాలు డ్రామాను రక్తి కట్టించడానికి పూనుకున్నారు. ఎలాగు శుక్రవారం సుప్రీమ్ కోర్ట్ లో క్వాష్ పిటీషన్ పై విచారణ జరుగుతుందని తెలిసిన చంద్రబాబు లాయర్లు ఈ విషయాన్ని వాడుకోవడానికి బలంగా ఫిక్స్ అయ్యారు.

చంద్రబాబు ఆరోగ్య సమస్యలను బలంగా వాదించడం మూలంగా న్యాయవ్యవస్థను ఒత్తిడి చేసి గెలవాలని రాక్షసపు ఆలోచనలు చేశారు. దీనికి బలంగా చంద్రబాబు ఈ నెల రోజుల కాలంలో జైల్లో ఉండగా శరీర బరువులో 5 కేజీలు తగ్గిపోయారంటూ మరో నాటకానికి తెరలేపారు. తద్వారా కిడ్నీలకు చాలా ప్రమాదమంటూ ఈ ఉదయం నుండి అధికంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఇక్కడ టీడీపీ నేతలు ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారు అనిపిస్తోంది, “చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అన్నది నిర్దారించాల్సింది వైధ్యులా లేదా టీడీపీ నాయకులా ?

అయితే ఇక్కడ సాధారణ వ్యక్తులు ఆలోచించాల్సింది.. ఎంత ఎండ అయినా , ఉక్క పోస్తున్నా , అది జైల్లో ఉన్న , ఇంట్లో ఉన్నా ఎక్కడైనా ఒకటే ? ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని బెయిల్ కనుక మంజూరు చేస్తే ? మన దేశంలో ఈ సమస్యలతో ఎన్ని జైళ్లు లేవు ? ఎంతమంది తమకు కూడా బైలు ఇవ్వాలని అడగరు ఒక్కసారి ఆలోచించండి. చట్టం ద్రుష్టిలో ప్రతి ఒక్కరూ సమానమే అన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి.

ఒక భార్యగా జైల్లో ఉన్న తన భర్త చంద్రబాబు ఆరోగ్యం గురించి భువనేశ్వరి ఎలా చెప్పగలుగుతున్నారు ?

ఇటీవల ఆమె మాట్లాడిన మాటల్లోనే నా భర్త ఆరోగ్యంగా ఉన్నారని ? జైల్లో ఉన్న చాలా దైర్యంగా ఉన్నారని చెప్పారు. అంతలోనే అనారోగ్యం గురించి మాట్లాడుతున్నారు అంటే పరిస్థితి అందరికీ అర్ధమైపోతోంది.
కానీ ఇప్పుడు మాత్రమే నా భర్త ఆరోగ్యంగా లేరు?

ఫైనల్ గా వీళ్ళు చెప్పే కారణాలు పెట్టే వంకలు చాలా విచిత్రంగా ఉండడమే కాకుండా, ఎవ్వరూ నమ్మే పరిస్థితిలో లేరు. ఎన్ని ప్రయత్నాలు చేసినా , ఎన్ని నాటకాలు ఆడినా తప్పు చేసిన వారు చట్టం నుండి తప్పించుకునే ప్రసక్తే లేదు.

Read more RELATED
Recommended to you

Latest news