తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించారు సీఎం కేసీఆర్. అర్హులైన వారందరికీ రూ.400 కే సిలిండర్, ఆరోగ్య శ్రీ కి రూ.16లక్షలకు పెంపు, అసైన్డ్ భూముల యజమానులకు పట్టాలు, రేషన్ కార్డు ఉన్న వారికి సన్నబియ్యం పంపిణీ వంటివి మేనిఫెస్టోలో ప్రకటించారు.
ముఖ్యంగా రైతులకు ఒక శుభవార్త అనే చెప్పాలి. ఇప్పటికే తెలంగాణ ఎకరానికి రూ.12వేలు అందజేస్తున్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు 16వేలకు పెంచారు. రైతుబంధుతో తెలంగాణలో వ్యవసాయాన్ని స్థిరీకరిస్తామని తెలిపారు. మొదటి ఏడాది రూ.12వేలు అందజేసి.. ఆ తరువాత ప్రతీ విడుతకు రూ.500 పెంచనున్నట్టు సీఎం కేసీఆర్ రైతుబంధు పథకం గురించి ప్రకటించారు. ప్రజలందరికీ రూ.5లక్షల కేసీఆర్ బీమా.. ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా 93 లక్షల కుటుంబాలకు వర్తించనుంది. ఎల్ఐసీ ద్వారా బీమా పంపిణీ. గిరిజనులకు పోడు భూముల పట్టాలు.. రైతు బంధు అమలు చేస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్. మైనార్టీ సంక్షేమానికి మరిన్నీ కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.