సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతాయి. చిల్లర నాణాలతో బైక్ కొన్నాడు ఇలాంటివి. అయితే సాధారణ ప్రజలు చిల్లర నాణాలతే బైక్ కొనడమే హైలెట్.. అలాంటిది ఓ బిచ్చగాడు. బస్తాడు చిల్లర నాణేలతో ఐఫోన్ 15 కొన్నాడు. ఇది కథ గొప్ప విషయం. అసలు బిచ్చగాడికి అంత ఖరీదైనా ఫోన్ కొనాలని ఎందుకు అనిపించిందో. ! ఈ తతంగం మొత్తం వీడియో తీశారు. అది ఇప్పుడు ఘోరంగా వైరల్ అవుతుంది.! ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..
మొన్నటి వరకూ జరిగిన సేల్‌లో లక్ష ఐఫోన్లు విక్రయించనట్లు డేటా చెప్తుంది. అందులో అందరూ ఐఫోన్ 14నే ఎక్కువగా కొన్నారు. కానీ ఈ బిచ్చగాడు మాత్రం ఇంత ఖరీదైన iphone 15 కొనడం హాట్ టాపిక్ అయింది. అయితే అసలు విషయం ఏంటంటే.. అతను నిజంగా బిచ్చగాడు కాదు. కేవలం ఆ వేషంలో ఉన్నాడు మాత్రమే. బిచ్చగాడి వేషంలో వెళ్లి ఐఫోన్ కొంటే ప్రజల స్పందన ఎలా ఉంటుంది అని వీడియో తీశారు.!
వీడియోలో, ఒక యువకుడు బిచ్చగాడి వేషంలో జోధ్‌పూర్‌లోని మొబైల్ షోరూమ్‌కు ఐఫోన్ కొనడానికి నాణేలతో కూడిన బ్యాగ్‌తో వెళ్లాడు. కానీ చాలా మొబైల్ షోరూమ్‌లు (షోరూమ్) అతని మురికి వేషాన్ని చూసి మొబైల్ షోరూమ్‌లోకి ప్రవేశించడానికి అనుమతించలేదు. కానీ చివరకు ఒక మొబైల్ షోరూమ్ అతని రిటైల్ కాయిన్‌ని స్వీకరించడం ద్వారా మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది. ఆపై యువకుడు తన చేతిలో ఉన్న నాణేల బ్యాగును మొబైల్ షోరూమ్ టేబుల్‌పై పడేశాడు. అప్పుడు అక్కడి సిబ్బంది అంతా కలిసి ఈ నాణేన్ని లెక్కించారు. అప్పుడు అతనికి ఐఫోన్ 15 ఇచ్చారు. ఈ బిచ్చగాడు షాప్ యజమానితో ఫోటో కూడా దిగాడు. అక్కడ కొందరు ఆశ్చర్యంగా అతనివైపు చూశారు.
వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి 34 మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. ఈ ప్రయోగాన్ని, అలాగే బిచ్చగాడిని తీసుకున్న షాపు యజమాని చర్యను పలువురు ప్రశంసిస్తున్నారు. అయితే ఇదంతా స్క్రిప్ట్ అని కొందరు నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు. మొత్తానికి వీడియో అయితే వైరల్ అవుతోంది.
View this post on Instagram