లోన్లు తీసుకున్న వారికి బ్యాడ్ న్యూస్.. అధిక వడ్డీ రేట్లు కొనసాగుతాయి : RBI

-

ద్రవ్యోల్బణం కట్టడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న కఠిన మానిటరీ పాలసీ నిర్ణయాల మూలంగా వడ్డీ రేట్లు గరిష్ట స్థాయికి చేరుకుంది. అయితే ఇవి ఎంతకాలం ఉంటాయనే దానిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తి కాంత్ దాస్ కీలక కామెంట్స్ చేశారు. ప్రస్తుత ఆర్థిక విధాన రూపకల్పన సంక్లిష్టంగా మారిందని గవర్నర్ శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. 2023లో ఇప్పటివరకు పాలసీ రేట్ల RBI విరామం కొనసాగించిందన్నారు. ప్రస్తుతం వడ్డీ రేట్లు అధికంగానే ఉన్నాయని ఇంకెంతకాలం కొనసాగుతాయో చెప్పలేమని స్పష్టం చేశారు. తాజాగా జరిగిన సదస్సులో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

భౌగోళిక రాజకీయ అనుచిత పరిస్థితులు తోడు అవడంతో ద్రవ్యాల్బణం కట్టడికి కేంద్ర బ్యాంకులన్నీ వడ్డీరేట్లు పెంచేశాయి. ఈ తరుణంలో ఆర్బిఐ సైతం గత ఏడాది మే నెల నుంచి దాదాపు 20050 బేసిన్ పాయింట్ కూడా పెంచింది. ఫిబ్రవరి నుంచి మాత్రం వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదని ఆర్బిఐ వెల్లడించింది. ఇప్పటికే రెపో రేటు 6.50 శాతానికి చేరింది. ఈ రేట్లు ఎంతకాలం స్థిరంగా ఉంటాయో అప్పుడే చెప్పలేమని.. కాలమే దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుందని చెప్పారు. ప్రపంచవృద్దిలో మందగమనము ద్రవ్యోల్భణం లాంటి సవాళ్లు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని శక్తికాంత చెప్పారు. ఆహార ద్రవ్యాలు పురంలో అనిచ్చితి నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆర్బిఐ తో సహా సెంట్రల్ బ్యాంకులు ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో బాధ్యత వహించాలని శక్తికాంత్ సూచించారు. ప్రస్తుతము క్రూడ్ ఆయిల్ ధర పెరుగుదల, బాండ్ల రాబడి పెరగడం వంటి తాజా సవాళ్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కలవరపెడుతున్నాయని చెప్పుకొచ్చారు ఆర్బిఐ గవర్నర్ శక్తి కాంత్ దాస్.

Read more RELATED
Recommended to you

Latest news