నాని ‘సరిపోదా శనివారం’ మూవీలో కీలక పాత్రలో.. కోలీవుడ్ డైరెక్టర్

-

నేచురల్​ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ దూకుడు మీదున్నాడు. దసరాతో సూపర్ హిట్ అందుకున్న నాని వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే హాయ్ నాన్న అంటూ ఓ ఫ్రెష్ స్టోరీతో సినిమాను ప్రకటించిన నాని ఇప్పుడు మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘అంటే సుందరానికి’ ఫేమ్​ దర్శకుడు వివేక్​ ఆత్రేయతో కలిసి సరిపోదా శనివారం అనే సినిమాలో నటిస్తున్నాడు నాని. ఇందులో నాని సరసన జెంటిల్​మెన్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. అయితే ఈ సినిమాలో ఓ కోలీవుడ్ డైరెక్టర్, నటుడు కీలక పాత్రలో నటిస్తున్నాడు.

తమిళ నటుడు కమ్​ దర్శకుడు ఎస్​జే సూర్య కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీలో ఎస్​జే సూర్య నెగిటివ్​ షేడ్స్​ ఉన్న పాత్రలో కనిపించనున్నాడట. ఈ పాత్ర కోసం ఆయన ఏకంగా ఎనిమిది కోట్ల రెమ్యూనరేషన్ అందుకోనున్నాడట. ఓ రోల్​ కోసం ఆయన ఈ స్థాయిలో పారితోషికం తీసుకోవటం ఇదే మొదటిసారని నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ఈ మధ్య కాలంలో ఎస్ జే సూర్య నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతుండటంతో ఆ మాత్రం డిమాండ్ ఉంటుందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news