WORLD CUP 2023: హార్దిక్ హెల్త్ అప్డేట్ పై ఇండియాకు గుడ్ న్యూస్!

-

వరల్డ్ కప్ లో ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో బౌలింగ్ చేస్తూ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ గాయం కారణంగా రెండు మ్యాచ్ లకు హార్దిక్ దూరం కాగా రేపు ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు కూడా దూరం కానున్నాడు. నేషనల్ క్రికెట్ అకాడమీ బెంగుళూరు లో శిక్షణ తీసుకుంటున్నాడు… తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హార్దిక్ పాండ్యా గాయం నుండి కాస్త కోలుకుని ప్రాక్టీస్ ను స్టార్ట్ చేసినట్లుగా చెబుతున్నారు.. అంతే కాకుండా జిమ్ సెషన్ లోనూ పాల్గొన్నాడని జాతీయ మీడియా ఒకటి పేర్కొంది. కానీ మ్యాచ్ లో ఆడాలంటే పూర్తిగా ఫిట్ అయితేనే సాధ్యం అవుతుంది. ఇందుకు ఎటువంటి క్లారిటీ లేదు.

ఒకవేళ లీగ్ మ్యాచ్ లలో ఇండియా జట్టుతో చేరకపోయినా కనీసం సెమీస్ మరియు ఫైనల్స్ కు అయినా రెడీ అయితే ఉపయోగం ఉంటుందని అందరూ భావిస్తున్నారు. మరి హార్దిక్ పాండ్య విషయంలో ఏమి జరగనుంది అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news