ముఖ్యమంత్రి వైయస్.జగన్ విజయనగరం జిల్లా పర్యటనలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. రైల్వే అధికారుల విజ్ఞప్తి మేరకు రైలు ప్రమాద ఘటన స్ధల పరిశీలన కార్యక్రమం రద్దు చేసుకున్నారు సీఎం జగన్. ఘటనా స్ధలంలో ప్రమాదానికి గురైన బోగీలను తొలగించి యుద్ద ప్రాతిపదినక ట్రాక్ పునురుద్ధరణ పనులు చేపడుతున్నట్టు తెలిపారు అధికారులు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఘటనా స్ధలానికి వస్తే… ట్రాక్ పునరుద్ధరణ పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని… విజ్ఞప్తి చేశారు రైల్వే అధికారులు. అయితే.. రైల్వే అధికారుల విజ్ఞప్తితో సీఎం జగన్ ప్రమాద ఘటనా స్ధల పరిశీలన కార్యక్రమం రద్దు అయింది. దీంతో నేరుగా విజయనగరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైయస్.జగన్. కాగా సీఎం జగన్ రెండు రోజులు విజయవాడలో పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం రాజ్ భవనలో జస్టిస్ జి. నరేందర్ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.