అక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్‍‌లకే మా ఓటు: తమ్మినేని వీరభద్రం

-

కాంగ్రెస్ పార్టీతో ఇంత అవమానకర పరిస్థితుల్లో పొత్తుకు వెళ్లలేమని చెబుతూనే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచే చోట మాత్రం అక్కడ గెలవగలిగిన కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతిస్తామని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు విఫలమైనట్లు ఆయన గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ గెలుపుకు అవకాశమున్న సీట్లలో అక్కడ ఏ పార్టీ గెలవగలిగితే ఆ పార్టీకి ఓటేస్తామన్నారు. బీజేపీపై కాంగ్రెస్‌కు గెలిచే సత్తా ఉంటే ఆ పార్టీకి, బీఆర్ఎస్ గెలిచే సత్తా ఉంటే అదే పార్టీకి ఓటేస్తామన్నారు. కానీ బీజేపీని రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవనీయకూడదనేది తమ నిర్ణయమన్నారు.

Tammineni Veerabhadram,ఖమ్మంలో టెన్షన్.. ఇకపై తెల్దారుపల్లిలోనే ఉంటా..  తమ్మినేని హాట్ కామెంట్స్ - cpm telangana president tammineni veerabhadram  meeting at teldarupalli khammam - Samayam Telugu

పొత్తుల విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట మార్చిందని అసహనం వ్యక్తం చేశారు. తమకు కావాల్సింది మంత్రి పదవులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కాదని స్పష్టం చేశారు. అవమానకర రీతిలో ఉండే పొత్తులు తమకు అవసరం లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని ఒక్క సీటు కూడా గెలవనివ్వమని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోతే సీపీఐ కూడా తమతో కలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, భద్రాచలం, అశ్వరావుపేట, పాలేరు, మధిర, వైరా, ఖమ్మం, సత్తుపల్లి, మిర్యాలగూడెం, నల్లగొండ, నకిరేకల్, భువనగిరి, హుజూర్‌నగర్, కోదాడ, జనగామ, ఇబ్రహీంపట్నం, పటాన్‌చెరు, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో సీపీఎం పోటీ చేయబోతున్నట్లు తెలిపింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news