రాబందులే త‌ప్ప రైతుబంధులు లేరు : కేసీఆర్‌

-

ఒక్క ఛాన్స్.. ఒక్క ఛాన్స్.. ఇవ్వండి అంటున్న కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఒక్క ఛాన్స్ ఎందుకు..? పంటికి అంట‌కుండా మింగుదామ‌నా..? అని కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ధ‌ర్మ‌పురి నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ప్ర‌జాస్వామ్యంలో ఓటు వ‌జ్రాయుధం.. ఆ ఓటు నీత‌ల‌రాత‌ను మారుస్త‌ది.. నీ భ‌విష్య‌త్‌ను నిర్ణ‌యం చేస్త‌ది అని కేసీఆర్ తెలిపారు. అందుకే ఆషామాషీగా ఓటు వేయొద్దు.

KCR silent on sops to Munugode; public unhappy

గ‌తంలో కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్లు ప‌రిపాలించింది. మ‌ళ్లా ఇవాళ వ‌చ్చి ఒక్క‌సారి మాకు ఛాన్స్ ఇవ్వండ‌ని అంటున్న‌రు. ఎందుకు పంటికి అంట‌కుండా మింగుదామ‌నా..? దేనికి మీకు..? ఒక్క సారి కాదు.. 11, 12 సార్లు ఛాన్స్ ఇచ్చారు. మీకు ఇవ్వ‌లేద‌ని కాదు. ఈశ్వ‌ర్ ఎమ్మెల్యే అయ్యాక ధ‌ర్మ‌పురి ఎలా ఉంది.. అంత‌కుముందు ఎట్ల ఉండేనో తేడా గ‌మ‌నించాలి. టెయిల్ ఎండ్ కాలువ‌లు ఉన్నాయి.. ఆ రోళ్ల‌వాగు ప్రాజెక్టు అని స‌తాయించిండు. నా వెంట‌ప‌డి ఆ ప‌నులు చేయించాడు. ఇవాళ దాదాపు 1 ల‌క్ష 30 వేల ఎక‌రాలు సాగు అవుతుంది. ఈ తేడాను మీరు గ‌మ‌నించాలి అని కేసీఆర్ సూచించారు.

ఒకప్పుడు అప్పులు వసూలు చేసేందుకు రైతుల ఇళ్ల తలుపులు పీక్కుపోయేవారు. ఒకప్పుడు రాబంధులే తప్ప రైతు బంధులు లేరు. రైతు బంధుతో రైతులు కొంత తెల్లబడ్డారు. ఉచిత కరెంట్ ఇస్తున్నాం. ధాన్యం ప్రభుత్వమే కొంటోంది. కాంగ్రెస్ నాయకులు ప్రమాదకరంగా మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీకి ఎద్దు, ఎవుసరం ఎరికేనా? ధరణి తీసేస్తామంటున్నారు. ఒకప్పుడు అధికారులు భూములు ఒకరి పేరు మీద నుంచి మరొకరి పేరు మీదకు మార్చేవారు. ధరణితో రైతుల భూములకు రక్షణ వచ్చింది. ధరణి వల్లే రైతు బంధు, రైతుబీమా సక్రమంగా అందుతున్నాయి. ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు కూడా ఏ దళారి ప్రమేయం లేకుండా రైతుల ఖాతాల్లో వేస్తున్నాం. కాంగ్రెస్ ధరణి తీసేస్తే ఈ డబ్బులన్నీ ఎలా వస్తాయి? మళ్లీ పాత దుకాణం తెరుస్తారా?

 

 

Read more RELATED
Recommended to you

Latest news