CM KCR : కొనాయిపల్లిలో సీఎం కేసీఆర్..ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా కొనాయిపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా స్వామివారి పాదాల ముందు సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు నామినేషన్ పత్రాలు పెట్టి పూజలు చేశారు. ఇక ఈ నెల 9న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో నామినేషన్ వేయనున్న సీఎం కేసీఆర్.. ఇవాళ కొనాయిపల్లిలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
38 ఏళ్లుగా కొనాయిపల్లి వెంకన్న ఆలయంలో పూజలు చేస్తున్నారు సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ఇది ఇలా ఉండగా… భైంసా ప్రజా ఆశీర్వాద సభలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్. గోదావరి నదికి తెలంగాణలో పుస్కరాలు లేవు. తెలంగాణ ఉద్యమం సమయంలో తాను కొట్లాడితే.. తెలంగాణలో గోదావరి పుష్కరాలు వచ్చాయని తెలిపారు సీఎం కేసీఆర్. తెలంగాణ తెచ్చిన నాయకుడిగా నా మాట నమ్మండి. ఓటును సరైన పార్టీకి వేస్తే భవిష్యత్ సరైన పద్దతిలో ఉంటుంది. అనవసరంగా ప్రతిపక్షాల మాయలో ఓటర్లు పడొద్దన్నారు.