గుంటూరు జిల్లా తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ – రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి నీ ఎండగడుతూ స్పష్టమైన ప్రశ్నలతో ముందుకు వెళ్తుంటే ప్రభుత్వం ఎదురు దాడి చేస్తుందన్నారు. పథకాలు నిజాయితీగా నేరుగా అంతిమంగా ప్రజలకు అందాలనేదే మా పోరాటం అని తెలిపారు. పాలవెల్లి పథకం పాపాల వెల్లువ అని, పాలవెల్లి పథకంలో స్కామ్ జరిగిందని చెబితే మంత్రి స్పందించడానికి ఈన్ని రోజులు పట్టిందా అని ఆయన అన్నారు.
అంతేకాకుండా.. ‘కోట్లు పెట్టి పథకాలు తెచ్చినప్పుడు రాష్ట్రంలో పాల ఉత్పత్తి ఎందుకు పెరగలేదు. పాల వెల్లువ పథకం వైసీపీ నాయకుల కోసం అమూల్ డైరీ కోసమే కోసమే బటన్ నొక్కారు. పథకంలో వేల కోట్లు అవినీతి జరిగింది ఆ డబ్బులు అన్ని ఎటుపోయాయో సమాధానం చెప్పాలి. మి శాఖ మీద జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడాలి. ఈ మంత్రి మీదే మరో అంబులెన్స్ స్కాం బయట పెడతాము దానికి కూడా సిద్దంగా ఉండండి. మీ శాఖ ద్వారా ప్రభుత్వం డబ్బులు నష్టం జరుగుతుంటే మీకు బాధ లేదా. మేము సిద్దంగా ఉన్నాము మండల,గ్రామాల,ద్వారా లిస్ట్ ఇవ్వండి ఎక్కడికి కావాలి అంటే అక్కడికి వెళ్దాము మా జనసేన శ్రేణులు కూడా వస్తారు మిలో నిజాయితీ ఉంటే. ప్రభుత్వం చేస్తున్న స్క్యంలు ఆధారాలు తో సహా బయట పెడతాము వైసిపి ప్రభుత్వం సిద్దంగా ఉండండి. పశువుల కొనుగోలు విషయంలో ఒక మంత్రి 2,08,790 పశువులు కొనుగోలు చేసామని చెప్తే ,మరో మంత్రి 3, 94,000 పశువులు కొనుగోలు చేయడం జరిగిందని చెప్పడం ఏమిటి. సాక్షాత్తు శాసనసభలో 3,92, 911 పశువులు కొనుగోలు చేయడం జరిగిందని మరో అబద్ధం చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు. క్లాస్ వార్ అని ప్రగల్బాలు పలికే ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ పాలన సాగిస్తుంది. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి స్కామ్ గురించి ఎండగడుతూ స్పష్టమైన ఆధారాలతో ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలకు న్యాయం చేయడమే జనసేన లక్ష్యమని. రాష్ట్రంలోని పాడి పరిశ్రమ పట్ల మంత్రులు తమకు తోచిన విధంగా వ్యాఖ్యలు చేయడం సబబు కాదు. అధికారులు చెప్పిన లెక్కలకు మంత్రులు చెప్పే లెక్కలకు పొంతన లేదు.’ అని నాదెండ్ల మనోహర్ అన్నారు.