బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు రెండో రోజు భోజన విరామం సమయానికి భారత్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓవర్ నైట్ స్కోరు 86/1తో రెండో రోజు బరిలోకి దిగిన భారత్ ఆట ప్రారభంలోనే 15 పరుగుల వ్యవధిలో రెండు కీలక వికెట్లను భారత్ చేజార్చుకుంది. రెండో రోజు ప్రారంభమైన టెస్టులో 105 పరుగుల వద్ద చెతేశ్వర్ పుజారా( 54 పరుగులు 72 బంతుల్లో 9 ఫోర్లు) వికెట్ కోల్పోయింది. జాయేద్ బౌలింగ్‌లో సబ్ స్టిట్యూ ప్లేయర్ హసన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ పరుగులులేమి చేయకుండానే వెనుదిరిగాడు. జాయేద్ బౌలింగ్ లో ఎల్బీడబ్యూ రూపంలో 119-3 వికెట్లు కోల్పోయింది ఆవుటైయ్యాడు.