బాబు మోహన్ బిగ్ షాక్ తగిలింది. ఆందోల్ బిజెపి అభ్యర్థి బాబు మోహన్ కుమారుడు బిఆర్ఎస్ లో చేరుతున్నారు. బాబు మోహన్ కుమారుడు ఉదయ బాబు.. తెలంగాణ ఆర్థిక మంత్రి వర్యులు హరీష్ రావు సమక్షంలో కారు పార్టీలో చేరనున్నారని తెలిసింది. సిద్దిపేట్ లో హరీష్ రావును కలిసి ఆయన గులాబీ కండువా కప్పుకొనున్నారని చెబుతున్నారు.
బాబు మోహన్ ఈ ఎన్నికల్లో ఆందోల్ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. టికెట్ దక్కలేదని, అయితే ఆందోల్ నియోజకవర్గం టికెట్ ను ఉదయబాబు ఆశించారు. అది తనకు కాకుండా తండ్రికి దక్కడంతో ఆయన ఆగ్రహం చెంది బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తండ్రికి టికెట్ ఇస్తే తనయుడికి ఆగ్రహం ఏంటని ఉదయ్ పై బాబు మోహన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.