నిన్న గుజరాత్ లోని అహమ్మదాబాద్ లో మ్యాచ్ ను వీక్షించిన అమిత్ షా ఆ తర్వాత తెలంగాణ పర్యటనకు వచ్చాడు. రాష్ట్రంలో ఎన్నికలు జరగడానికి ఇక కేవలం పది రోజులు మాత్రమే సమయం ఉంది. ఇందులో బీజేపీ తరపున ప్రచారం చేసిన అమిత్ షా కోరుట్లలోని సకల జనుల విజయ సంకల్ప సభ లో కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. అమిత్ షా మాట్లాడుతూ కాంగ్రెస్ మరియు BRS పార్టీలు రామమందిరాన్ని ఎంతగానో వ్యతిరేకించాయి అంటూ ఆరోపణలు చేశారు. ఇప్పుడు తెలంగాణాలో ప్రజలు వీరిని గెలిపిస్తారా అంటూ ప్రశించారు అమిత్ షా, ఈ ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన లాభం ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో అభివృద్ధిని జరిపిస్తూ సంకలు గుద్దుకుంటున్నారంటూ కేసీఆర్ పై మండిపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే కుటుంబ పాలనకు స్వస్తి పాలకొచు అంటూ అమిత్ షా ప్రజలను కోరారు. ఇక కాంగ్రెస్, BRS మరియు ఎంఐఎం లు అన్నీ ఒక్కటేనంటూ మరోసారి ప్రజలకు గుర్తు చేశారు అమిత్ షా.