పదవుల కోసం వెంపర్లాడే వ్యక్తిని కాదు: సీఎం కేసీఆర్

-

తెలంగాణాలో ఎన్నికలు జరగడానికి కేవలం వారం మాత్రం సమయం ఉంది. అందుకే మిగిలిన ఈ తక్కువ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పోటీ చేస్తున్న అభ్యర్థులు అంతా తమ తమ నియోజకవర్గాలలో ప్రచారాలను నిర్వహిస్తూ ప్రజలను ప్రసన్నం చేసుకుంటున్నారు. కాగా తాజాగా సీఎం కేసీఆర్ పరిగి సభలో మాట్లాడుతూ నేను ఎప్పుడూ పదవుల కోసం ఆశించి పనిచేసిన వ్యక్తిని కాదంటూ ప్రజల సమక్షములో చెప్పుకొచ్చాడు. నేను పుట్టింది రాజకీయం చేస్తోంది అంతా తెలంగాణ ప్రజల కోసమే అంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు కేసీఆర్. ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఈ తెలంగాణ మళ్ళీ ఆగం కావద్దన్న ఒక్క ఆందోళనతోనే మళ్ళీ నన్ను గెలిపించండి అని అడుగుతున్నా అంటూ కేసీఆర్ స్పష్టంగా తెలియచేశారు. మీరు అభివృద్ధి అవ్వడానికి మీకు ఏమి కావాలో అది చేయడానికి మా ప్రభుత్వం ఎప్పుడూ సిద్దంగానే ఉంటుందని కేసీఆర్ అర్థమయ్యేలా చెప్పాడు.

మరి పరిగి నియోజకవర్గ ప్రజలకు కేసీఆర్ చెప్పిన మాటలు అర్ధమయ్యి గెలుపుకు సహాయపడతాయా అన్నది తెలియాలంటే డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news