పుణ్యస్త్రీ కావాలని ఆహారం మానేసి భర్త కంటే ముందే మరణించిన భార్య…!

-

భర్త కంటే భార్య ముందు మరణిస్తే…? ఎలా అయినా బ్రతికేస్తుంది భార్య అంటూ ఉంటారు. తన పిల్లల కోసం, మనవళ్ల సంతోషాలు చూడటానికి జీవితంలో ముందుకి వెళ్లి జీవిస్తారని అభిప్రాయపడుతూ ఉంటారు. అభిప్రాయం ఏముంది గాని వాస్తవం కూడా అదే… నేటి సమాజంలో ఎక్కువగా ఇలాంటి చూస్తున్నాం… ఎక్కడో అరుదుగా భార్య చనిపోతే భర్త ఆత్మహత్య చేసుకోవడం లేకపోతే భర్త చనిపోతే భార్య గుండెపోటుతో లేదా దిగులుతో చనిపోవడం చూస్తూ ఉంటాం… అది కూడా కోటి మందిలో పది మంది మాత్రమె.

భార్యా భర్తల బంధానికి విలువ ఇవ్వని వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం… భర్త మరణిస్తే భార్య కనీసం పట్టించుకోకుండా వ్యవహరించి ఆ బంధానికి తల వంపులు తెస్తూ ఉంటుంది. భర్త కూడా అంతే… ఇవి కూడా ఎక్కువగానే ఈ మధ్య సోషల్ మీడియా పుణ్యమా అని వస్తున్నాయి. కొందరు మాత్రం బలవన్మరణాలకు పాల్పడుతూ ఉంటారు. ఇలాంటి వారికి, సమాజానికి తన చావుతో సమాధానం చెప్పింది ఒక భార్య. తన భర్త కంటే ముందే చనిపోయి… పుణ్య స్త్రీ కావాలని భావించింది. భార్యా భర్తల బంధానికి అమితమైన విలువను ఇస్తూ తనువు చాలించింది ఒక వృద్ధురాలు.

వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా అమర్తలూరు మండలం గోవాడలో రాష్ట్ర అర్చక సేవా సమితి పూర్వ అధ్యక్షులు రాష్ట్ర అర్చక సమాఖ్య పూర్వ అధ్యక్షులు ప్రస్తుత రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీమాన్ దీవి కోదండరామ శర్మ (85) అయన సతీమణి అంజనాదేవి (82) ఇరువురు మరణించారు. భర్త కంటే ముందుగా భార్య చనిపోతే పుణ్య స్త్రీ అవుతుందని గత 20 రోజులనుంచి అంజనా దేవి ఆహారం తీసుకోకుండా గత అర్దరాత్రి మరణించింది తరువాత భర్త కోదండ రామ శర్మ మరణించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె పుణ్యస్త్రీ అంటూ పలువురు వ్యాఖ్యానిస్తే అవన్నీ మూఢ నమ్మకాలు అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news