ఉప ఎన్నిక విష‌యంలో జ‌గ‌న్ వెన‌క‌డుగు… క‌థ అడ్డం తిరిగిందా…!

-

ఏపీలో రాజ‌కీయం రోజుకో ర‌కంగా మారుతోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు టీడీపీలో అధినేతను దేవుడు, రాము డు అని కీర్తించిన గొంతులు ఇప్పుడు విమ‌ర్శిస్తున్నాయి. పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ముఖ్యంగా గ న్న‌వ‌రం ఎమ్మెల్యే వంశీ విష‌యం రాష్ట్రంలోనే కాకుండా ప‌క్క‌రాష్ట్రం తెలంగాణ‌లోనూ సంచ‌ల‌నంగా మా రింది. ఇప్ప‌టికే ఆయ‌న పార్టీకి రాజీనామా చేశారు. ఇక‌, ఈ విష‌యంలో ఆదిలో కొంత తిక‌మ‌క పెట్టినా.. ఇప్పు డు క్లారిటీ ఇచ్చేశారు. తాను జ‌గ‌న్ అడుగు జాడ‌ల్లో న‌డుస్తాన‌ని, ఆయ‌న ప‌థ‌కాలు త‌న‌కు బాగా న‌చ్చాయ‌ని, ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం విద్య త‌న‌ను ఆక‌ట్టుకుంద‌ని చెప్పారు.

దీంతో రేపో మాపో.. వంశీ టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే, ఇలా జంప్ చేసేందుకు ఇప్పుడు అధికారంలో ఉన్న‌ది వైసీపీ. గ‌తంలో అయితే, టీడీపీలోకి ఎవ‌రొచ్చినా.. పార్టీ లోకి తీసుకుని కండువా క‌ప్పేసి ప‌ద‌వులు అప్ప‌జెప్పేసేవారు. కానీ, జ‌గ‌న్ వ్య‌వ‌హారం అలా కాదు. ఏ నాయ‌కుడైనా.. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న పార్టీలో తెచ్చుకున్న ప‌ద‌వుల‌ను, ఆ పార్టీని కూడా వ‌దిలి వ‌స్తేనే పార్టీలోకి తీసుకుని కండువా క‌ప్పుతాన‌ని అసెంబ్లీ సాక్షిగా ప్ర‌క‌టించారు. దీంతో ఇప్పుడు వంశీ ప‌రిస్థితి కూడా అంతేకావాలి. అంటే, టీడీపీ పార్టీకి, ఆ పార్టీ ద్వారా వ‌చ్చిన ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా ఆయ‌న రిజైన్ చేయాలి.

కానీ, ఈ విష‌యంలో వంశీ కేవ‌లం పార్టీ కి మాత్ర‌మే రాజీనామా చేశాడు. త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి మాత్రం ఇ ప్ప‌టికీ రాజీనామా చేయ‌లేదు. దీనికి కార‌ణ‌మేంటి? వాస్త‌వానికి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా వంశీ రాజీ నామా చేయాల‌ని చూసినా.. చివ‌రి నిముషంలో వైసీపీ నుంచి వ‌ద్ద‌నే సంకేతాలు వ‌చ్చాయ‌ని తెలుస్తోంది. అయితే, ఎందుకు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయొద్ద‌ని చెప్పార‌నే విష‌యంలో ఇత‌మిత్ధంగా ఎలాంటి కారణం బ‌య‌ట‌కు పొక్క‌క పోయినా.. ప్ర‌స్తుతం టీడీపీ, జ‌న‌సేన‌లు పుంజుకున్నాయి. అదే స‌మ‌యంలో ఇ సుకపై కొన్ని వ‌ర్గాల్లో వ్య‌తిరేక‌త ఉంది.

ఈ విష‌యంలో ప్ర‌భుత్వం ఇప్ప‌టికిప్పుడు ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్నా.. ఫ‌లితం లేదు. పైగా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాల ఫ‌లాలు ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చేందుకు కూడా స‌మ‌యం ప‌డుతుంది. అందుకే ఇప్ప‌టికిప్పుడు వంశీతో రాజీనామా చేయించ‌డం కంటే.. మ‌రో నాలుగు మాసాల త‌ర్వాత రాజీనామా చేయించ‌డం ఉత్త‌మ‌మ‌ని, అప్ప‌టికి ఇంకా ఎవ‌రైనా వ‌స్తే.. వారిని కూడా ఇదే వ‌రుస‌లో రిజైన్ చేయించి ఉప పోరుకు వెళ్తే బెట‌ర‌ని వైసీపీ భావిస్తున్న‌ట్టు ఆఫ్‌ది రికార్డుగా తెలుస్తోంది. మొత్తంగా ఇప్ప‌ట్లో ఉప పోర లేన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Read more RELATED
Recommended to you

Latest news