మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణ పై స్పష్టంగా కనిపిస్తోంది. ఈ తుఫాను కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి నిన్న రాత్రి నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో నిన్న రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది.
జూబ్లీహిల్స్ యూసఫ్ గూడా, ఖైరతాబాద్, షేక్ పేట మణికొండ, చార్మినార్, టోలిచౌక్, మెహదీపట్నం లాంటి ప్రధాన ప్రాంతాలలో రాత్రి నుంచి భారీ వర్షం పడుతోంది. దీంతో హైదరాబాద్ జనాలు బయటకు రావడం లేదు. వర్షంతో పాటు… చలి తీవ్రత కూడా విపరీతంగా ఉంది.
ఇది ఇలా ఉండగా.. మిచాంగ్ తుఫాన్ తో భారీగా పలు విమానాలు రద్దు అయ్యాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి నడిచే 15 విమానాలు నేడు క్యాన్సిల్ అయ్యాయి. విశాఖ, చెన్నై, బెంగుళూరు, హైద్రాబాద్, షిర్డీ, కడప, ఢిల్లీ ఫ్లైట్స్ రద్దు చేశారు అధికారులు. రేపటి పరిస్థితి బట్టి ఫ్లైట్స్ రాకపోకలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.