తెలంగాణలో బాలికపై అత్యాచారం జరిగిన సంఘటనలో..నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష వేసింది కోర్టు. ఇప్పుడు ఈ సంఘటన దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ కు చెందిన ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నేరస్తుడికి 20 యేండ్లు జైలు శిక్ష పడింది. ఈ మేరకు ఎల్బీనగర్ పొక్సో స్పెషల్ కోర్టు తీర్పు వెలువరించింది.
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం దాతపల్లి గ్రామానికి చెందిన సపావత్ అంజిత్ కుమార్(28) 2017 సంవత్సరంలో అదే గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. ఈ సంఘటనలో మంచాల పోలీసులు పొక్సో చట్టం కింద కేసు అయింది. ఈ తరుణంలోనే సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించగా , విచారణ జరిపింది ఎల్బీ నగర్ లోని పొక్సో స్పెషల్ కోర్టు. దీంతో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నేరస్తుడికి 20 యేండ్లు జైలు శిక్ష పడింది. ఇక కోర్టు తీర్పు పట్ల బాధిత కుటుంబం హర్షం వ్యక్తం చేస్తోంది.