కేసీఆర్ కోసం దయచేసి ఎవ్వరూ ఆసుపత్రికి రావద్దు : మంత్రి హరీశ్ రావు

-

బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం అర్థరాత్రి తన ఫామ్ హౌస్ లో ఉన్న బాత్రూమ్ లో కాలు జారి కింద పడిపోయారు. దీంతో తన ఎడుమ కాలు తుంటి ఎముక విరిగినట్టు వైద్యులు వెల్లడించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై పలువురు అడిగి తెలుసుకుంటున్నారు. తెలంగాణ నూతన సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరా తీశారు. యశోధ ఆసుపత్రి వద్ద భద్రత పెంచాలని అధికారులకు సూచించారు సీఎం.

కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ఇవాళ సాయంత్రం కేసీఆర్ హిప్ రిప్లేస్ మెంట్ చేస్తారని వెల్లడించారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగానే ఉందని.. పరిస్థితుల ద్రుష్ట్యా పార్టీ శ్రేణులు అభిమానులు యశోధ ఆసుపత్రికీ రావద్దని కోరారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడూ వైద్యులు ప్రకటన విడుదల చేస్తారని తెలిపారు. సీఎం కేసీఆర్ దాదాపు రోజుల పాటు విశ్రాంతి కావాలని.. ఎక్కువ మంది కలిస్తే.. ఆయనకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశముంది కాబట్టి పరిస్థితి సద్దుమణిగాక కలివాలని సూచించారు హరీశ్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news