తాజాగా స్మార్ట్ ఫోన్ తయారీల సంస్థ వివో “స్విచ్ ఆఫ్” పేరుతో ఈనెల dec 20 వ తేదీన తమ కస్టమర్స్ అందరూ ఫోన్ స్విచాఫ్ చేయాలని కోరింది. డిసెంబర్ 2వ తేదీన రాత్రి 8 గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య వారు తమ పిల్లలతో మరియు ఇతర కుటుంబ సభ్యులతో సమయాన్ని సంతోషంగా గడపాలని కోరింది. కంపెనీ చేసిన ఓ సర్వేలో 77 శాతం పిల్లలు విపరీతంగా ఫోన్లు వాడుతున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో…. విపరీతంగా ఫోన్లు పిల్లలు మరియు తల్లిదండ్రులు వాడడం వలన వారి మధ్య అంతరాలు ఏర్పడి రాబోయే రోజుల్లో ఆటంకం కలుగుతుందని కంపెనీ వారు పేర్కొన్నారు.
తొలుత అల్లరి చేస్తున్నారని లేక తినడానికి మారం చేస్తున్నారని ఫోన్లు పిల్లలకి ఇవ్వడం వలన వారికి ఇది వ్యసనంగా మారుతుందని స్పష్టం చేసింది. ఒక సర్వే ప్రకారం….42 శాతం 12 సంవత్సరాలలోపు పిల్లలు రోజుకి రెండు నుంచి నాలుగు గంటలు మొబైల్ వాడుతున్నారని అలాగే 12 సంవత్సరాల వయసు పైబడిన పిల్లలు 47 శాతం మంది ఫోన్లను వాడుతున్నారని వెల్లడి అయింది. 67% మంది పిల్లలకి సొంత ఫోన్లు మరియు ట్యాబులు కలిగి ఉన్నాయట. 12 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు కలవారు ఎలాంటి షరతు లేకుండా ఇంటర్నెట్ యాక్సిస్ పొందుతున్నారని వెల్లడించింది.