ఎన్టీఆర్ తో అట్లీ సినిమా ఆ జానర్ లోనా….??

-

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా మరొక హీరోగా నటిస్తున్నారు. చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా బాలీవుడ్ నటి అలియా భట్ ఎంపిక కాగా, మరొక హీరోయిన్ అన్వేషణ ప్రస్తుతం కొనసాగుతోంది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ నటుడు సముద్రఖని, అలానే టాలీవుడ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ చేయబోయే సినిమాల లిస్టు అంతకంతకు పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్, కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో, అలానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమాలు చేస్తారని కొద్దిరోజులుగా వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే కొద్దిరోజుల క్రితం తనకు ఎన్టీఆర్ తో ఒక మంచి సినిమా తీయాలని కోరికుందని తమిళ దర్శకుడు అట్లీ కుమార్ బయట పెట్టడం జరిగింది. ఇక తన సినిమాల రిలీజ్ తరువాత ఎన్టీఆర్ గారు తప్పకుండా కాల్ చేసి ఎంతో అభినందిస్తుంటారని కూడా అట్లీ చెప్పడం జరిగింది. కాగా వారిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా మంచి మాస్, కమర్షియల్ జానర్ లో తెరకెక్కనున్న తెలుస్తోంది.

నిజానికి అట్లీ సినిమాల్లో హీరోయిజానికి ఏ మాత్రం లోటుండదు, దానితో పాటు హీరో క్యారెక్టర్ నుండి మంచి మెసేజ్ కూడా ఉంటుంది. అయితే వీరిద్దరూ చేయబోయే సినిమా మాత్రం, ఈ విధంగానే ఉంటూ, ఒకింత ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ అంశాలు మరింత ఎక్కువగా ఉండనున్నట్లు చెప్తున్నారు. ఇటీవల విజిల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఎన్టీఆర్ ని కలిసిన అట్లీ, ఒక మంచి పవర్ఫుల్ కథను ఆయనకు వినిపించారని అంటున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఆర్ఆర్ఆర్ తరువాత మొదలెట్టే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే మరికొద్దిరోజులు ఓపిక పట్టాల్సిందే….!!

Read more RELATED
Recommended to you

Latest news