అంగన్వాడీలు తమ డిమాండ్లు పరిష్కరించేదాకా సమ్మె విరమింప చేసే ప్రసక్తి లేదని లేదని చెబుతుండగా ప్రభుత్వం మాత్రం సమ్మెను విరమించాలని విజ్ఞప్తి చేస్తుంది. స్త్రీ ,శిశు ,సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ సచివాలయంలో మాట్లాడుతూ అంగన్వాడీలు సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని కోరారు. ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాల చేశామని అన్నారు అలాగే పదవి విరమణ తర్వాత ఇచ్చే మొత్తాన్ని లక్ష రూపాయలకు పెంచామని తెలిపింది. గతంలో తెలంగాణలోని అంగన్వాడిలకు ఇస్తున్నట్టుగానే తమకి కూడా వేతనం ఇవ్వాలని సమ్మె చేసినప్పుడు వెంటనే 11,500 రూపాయలకు పెంచామని పేర్కొంది.
అంగన్వాడీల సమ్మె కారణంగా బాలింతలు గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి ఉషశ్రీ ఆవేదన వ్యక్తం చేసింది. అంగన్వాడీలకు అర్హతను బట్టి సంక్షేమ పథకాలు ఇస్తున్నామని కానీ ఇది గౌరవ వేతనం పెంచేందుకు తగిన సమయం కాదని స్పష్టం చేసింది. అంగన్వాడి కేంద్రాల తలుపులు పగల కొట్టారని వస్తున్న రూమర్స్ పై స్పందిస్తూ… ఎవరు తాళాలు పగలగొట్టలేదని పేర్కొంది.