పలు సంక్షేమ పథకాలకు అర్హత ఉండి పేమెంట్ ఫెయిల్ అయిన వారికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఇలాంటి వారితో పాటు గ్రీవెన్స్ క్లియర్ అయి కొత్తగా నవరత్నాలకు అర్హత పొందిన వారికి ఇవాళ అకౌంట్లలో నగదు జమ చేయనుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు అయ్యుండి కూడా సంక్షేమ పథకాలు అందని వారు చాలామంది ఉన్నారు.
అలా సంక్షేమ పథకాలు అందని వారి సంఖ్య చూస్తే 68,990 గా ఉంది. ఇక వీరందరి ఖాతాలలో సీఎం జగన్మోహన్ రెడ్డి డబ్బులు జమ చేయనున్నారు. బటన్ నొక్కి 97.76 కోట్లను సీఎం జగన్ రిలీజ్ చేస్తారు. జనవరి నుంచి జూన్ మధ్య అమలైన పథకాలకు సంబంధించి… జూన్ నుంచి జూలైలో, జూలై నుంచి డిసెంబర్ మధ్య అమలైన పథకాలకు సంబంధించి డిసెంబర్ – జనవరి మాసంలో సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే.