నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలం కేంద్రం గుండంపల్లి గ్రామాల మధ్య ఉన్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన ఉధృతంగా మారిపోయింది ఒక్కసారిగా గ్రామస్తులు, రైతులు తరలివచ్చారు ఫ్యాక్టరీ మీద దాడి చేశారు. వాహనాన్ని తగలబెట్టడంతో ఆ ప్రదేశం అంతా రణరంగంగా మారిపోయింది పోలీసులు లాటి చార్జ్ చేసిన రైతులు మాత్రం వెనక్కి తగ్గలేదు కొన్ని గంటలపాటు ఉద్రిక్తత సాగింది ఆఖరికి జిల్లా ఉన్నతాధికారులు సముదాయించడం వలన గ్రామస్తులు వెనక్కి తగ్గారు.
గ్రామస్తులు పలుమార్లు ఆందోళనను చేయడంతో పాటుగా అధికారులకి కూడా వినతి పత్రాలు ఇచ్చారు. ఉపయోగం లేదు. దీంతో బుధవారం ప్రజలు ఒక్కసారిగా పరిశ్రమ ప్రాంతాన్ని చుట్టుముట్టేశారు వందల మంది మూకుమ్మడిగా దాడికి పాల్పడడంతో నిర్మాణాలు ధ్వంసం అయ్యాయి. ఒక కారుకి నిప్పంటించేశారు. ఇథనాల్ పరిశ్రమ నిర్మించొద్దని డిమాండ్ చేస్తూ మూడు నెలలుగా ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాడుతున్న 60 మంది రైతుల పై ఇథనాల్ కంపెనీ ప్రతినిధి కంప్లైంట్ ఇచ్చారు. ఐపీసీ 307, 353, 342, 427 సెక్షన్ల కింద హత్యాయత్నం కేసులు నమోదు చేసారు.