గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌లో ‘ఓపెన్‌హైమర్‌’ హవా.. ఏకంగా ఐదు అవార్డులు సొంతం

-

గోల్డెన్‌ గ్లోబ్‌ 2024 అవార్డుల్లో ‘ఓపెన్‌హైమర్‌’ మూవీ సత్తా చాటింది. మొత్తం ఐదు భాగాల్లో ఈ పురస్కారాలను సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడు, దర్శకుడు, నటుడు (డ్రామా), సహాయ నటుడు, ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌ అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ నటుడిగా కిలియన్‌ మర్ఫీ, ఉత్తమ దర్శకుడిగా క్రిస్టఫర్‌ నోలన్‌కు అవార్డులు దక్కాయి.

క్రిస్టఫర్‌ నోలన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. శాస్త్రవేత్త జె.రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్‌లో అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. మార్గోట్ రాబీ, ర్యాన్ గోస్లింగ్ నటించిన ‘బార్బీ’ కూడా పలు కేటగిరీల్లో అవార్డులను సొంతం చేసుకుంది.

  • ఉత్తమ చిత్రం- ఓపెన్‌హైమర్‌
  • ఉత్తమ కామెడీ చిత్రం- పూర్‌ థింగ్స్‌
  • ఉత్తమ దర్శకుడు –  క్రిస్టఫర్‌ నోలన్‌(ఓపెన్‌హైమర్‌)
  • ఉత్తమ స్క్రీన్‌ప్లే – జస్టిన్‌ సాగ్‌ ట్రైట్‌, ఆర్ధర్‌ హరారి ( అనాటమీ ఆఫ్‌ ఎ ఫాల్‌)
  • ఉత్తమ నటుడు- సిలియన్ మర్ఫీ(ఓపెన్‌హైమర్‌)
  • ఉత్తమ నటి – లిల్లీ గ్లాడ్‌స్టోన్(కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్)
  • ఉత్తమ హాస్య నటి – ఎమ్మా స్టోన్ (పూర్‌ థింగ్స్‌)
  • ఉత్తమ హాస్య నటుడు – పాల్ గియామట్టి(ది హోల్డోవర్స్)
  • ఉత్తమ సహాయనటుడు – రాబర్ట్ డౌనీ జూనియర్(ఓపెన్‌హైమర్)
  • ఉత్తమ సహాయనటి – డావిన్ జాయ్ రాండోల్ఫ్(ది హోల్డోవర్స్)
  • ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌ – లుడ్విగ్ గోరాన్సన్(ఓపెన్‌హైమర్)
  • ఉత్తమ ఆంగ్లేతర చిత్రం – అనాటమీ ఆఫ్ ఎ ఫాల్
  • ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ – వాట్‌ వాస్‌ ఐ మేడ్‌ (బార్బీ)
  • ఉత్తమ యానిమేటెడ్‌ చిత్రం – ది బాయ్ అండ్ ది హెరాన్
  • బాక్సాఫీస్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు –  వార్నర్ బ్రదర్స్(బార్బీ)

Read more RELATED
Recommended to you

Latest news